ఆ ఇద్దరూ వద్దు, వారి ప్లేస్‌లో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారీలను ఆడిస్తే... వీవీఎస్ లక్ష్మణ్ సూచనలు...

Published : Dec 07, 2021, 03:47 PM IST

న్యూజిలాండ్‌ను స్వదేశంలో టీ20, టెస్టు సిరీస్‌లో చిత్తు చేసిన భారత జట్టు, సఫారీ టూర్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన టీమిండియా, ఈ పర్యటనలో ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది...

PREV
110
ఆ ఇద్దరూ వద్దు, వారి ప్లేస్‌లో శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారీలను ఆడిస్తే... వీవీఎస్ లక్ష్మణ్ సూచనలు...

సౌతాఫ్రికాలో పర్యటించే భారత జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. శ్రేయాస్ అయ్యర్‌తో పాటు మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్ రాణించడంతో ఎవరిని పక్కనబెట్టాలనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది...

210

రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దల్ ఠాకూర్ వంటి ప్లేయర్లు, టెస్టు టీమ్‌లో రీఎంట్రీ ఇస్తుండడంతో ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందా? అని ఎదురుచూస్తున్నారు అభిమానులు...

310

మెల్‌బోర్న్ టెస్టు తర్వాత పేలవ ఫామ్‌తో టీమిండియాకి భారంగా మారుతున్న వైస్ కెప్టెన్ అజింకా రహానేని తొలి టెస్టు నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్...

410

‘నా అభిప్రాయం ప్రకారం, అజింకా రహానేను తొలి టెస్టులో ఆడించకపోవడమే మంచిది. ఎందుకంటే ఐదో స్థానంలో ఆకట్టుకున్న శ్రేయాస్ అయ్యర్‌కి తగినన్ని అవకాశాలు ఇవ్వడం చాలా అవసరం...

510

శ్రేయాస్ అయ్యర్ ఆరంగ్రేటం టెస్టులో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాబట్టి అతన్ని ఆ స్థానంలో మరిన్ని మ్యాచులు ఆడించాలి. అజింకా రహానేకి రెస్ట్ కూడా అవసరం...

610

అలాగే సౌతాఫ్రికా టూర్‌లో హనుమ విహారికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అయితే విహారిని ఏ స్థానంలో ఆడించాలనేది విరాట్ కోహ్లీ కాంబినేషన్‌ బట్టి నిర్ణయించుకోవాలి...

710

టాప్ 5లో అందరూ బ్యాట్స్‌మెన్ ఉంటారు. టాప్ 6లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రిషబ్ పంత్ బ్యాటింగ్‌కి వస్తాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా వస్తాడు...

810

బ్యాటుతో అద్భుతంగా రాణిస్తున్న రవీంద్ర జడేజా, సౌతాఫ్రికా టూర్‌లో చాలా కీలకంగా మారతాడు. సఫారీ పిచ్‌లపై ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలో దిగడమే చాలా ఉత్తమం...

910

అలా చూసుకుంటే సీనియర్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్, 8వ స్థానంలో బ్యాటింగ్‌కి రావాలి. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లు వస్తారు... ’ అంటూ చెప్పుకొచ్చాడు వీవీఎస్ లక్ష్మణ్...

1010

అజింకా రహానేతో పాటు సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా కూడా వరుసగా ఫెయిల్ అవుతుండడంతో అతని స్థానంలో విహారిని ఆడిస్తే బెటర్ అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు... 

click me!

Recommended Stories