రక్తం కారుతున్నా, క్రీజు వదల్లేదు... ఆఖరి మ్యాచ్‌లో వాట్లింగ్ చూపించిన తెగువకి...

First Published Jun 23, 2021, 9:04 PM IST

న్యూజిలాండ్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్, అతనికి ఫేర్‌వెల్ మ్యాచ్. ఆఖరి మ్యాచ్‌లో వాట్లింగ్, అద్వితీయమైన తెగువను చూపించి క్రికెట్ ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు...

రవీంద్ర జడేజా రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన బీజే వాట్లింగ్, కిందపడడంతో అతని కుడి చేతి రింగ్ వేలుకి తీవ్ర గాయమైంది.
undefined
గాయం కారణంగా రక్తం కారుతున్నా, ఫిజియో చికిత్స తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చి కీపింగ్ చేశాడు వాట్లింగ్. అతని వేలి ఎముక పక్కకి జరిగిందని వైద్యులు తేల్చారు..
undefined
అయితే ఆఖరి టెస్టు ఆడుతున్న వాట్లింగ్, ఈ గాయం కారణంగా డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోలేనని చెప్పి.... నొప్పిని భరిస్తూనే క్రీజులోకి దిగాడు....
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో గాయం కారణంగానే బరిలో దిగలేకపోయాడు వాట్లింగ్. 35 ఏళ్ల వాట్లింగ్, రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతంగా వికెట్ కీపింగ్ చేసి అదరగొట్టాడు... రెండు వైపులా డైవ్ చేస్తూ ఒక్కటంటే ఒక్క బై కూడా రానివ్వలేదు...
undefined
75వ టెస్టు ఆడుతున్న వాట్లింగ్, 3789 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా 262 క్యాచులు అందుకున్న వాట్లింగ్, 8 స్టంపింగ్స్ చేశాడు.
undefined
ఫైనల్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో శుబ్‌మన్ గిల్, జడేజాలను అవుట్ చేసిన వాట్లింగ్, గాయం తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చిన తర్వాత జడ్డూ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడం విశేషం...
undefined
ఫైనల్ టెస్టు ఫైనల్ డే రోజు క్రీజులోకి వస్తున్న బీజే వాట్లింగ్, న్యూజిలాండ్ ప్లేయర్లు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో స్వాగతం పలకగా, కోహ్లీ అతన్ని ఆత్మీయంగా విష్ చేశాడు.
undefined
click me!