నిజమే న్యూజిలాండ్‌కి ఆ అడ్వాంటేజ్ ఉంది, కానీ మేమే గెలుస్తాం... - ఛతేశ్వర్ పూజారా...

First Published Jun 15, 2021, 11:27 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది న్యూజిలాండ్. టీమిండియా ఇప్పుడు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా, న్యూజిలాండ్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనడానికి కారణం అక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులే. తాజాగా దీనిపై స్పందించాడు టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా...

‘టెస్టులు మాత్రమే ఆడుతున్న నాలాంటి క్రికెటర్లకి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ లాంటిది. ఇది మాకు చాలా పెద్ద విషయమే కాదు, గొప్ప విషయం కూడా...
undefined
భారత జట్టులో ప్రతీ ఒక్కరూ ఫైనల్ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ఆడడానికి దాదాపు రెండేళ్లుగా కష్టపడుతున్నాం...
undefined
ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడి, ఆడడం భారత క్రికెటర్లకు ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేం..
undefined
ఈ వాతావరణ పరిస్థితులు న్యూజిలాండ్‌కి దగ్గరగా ఉంటాయి. అదీకాకుండా వాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడారు. ఆతిథ్య జట్టును ఓడించారు కూడా. ఇలా చూస్తేవారికి మా కంటే అడ్వాంటేజ్ ఉన్నట్టే...
undefined
అయితే మేం వారిని ఎదుర్కోవడానికి కావాల్సినంత ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్నాం. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కోవడానికి మెంటల్ స్ట్రాంగ్‌గా సిద్ధమయ్యాం...
undefined
ఫైనల్ మ్యాచ్‌కి ముందు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది. ఛాంపియన్‌షిప్ గెలిచే సత్తా భారత జట్టుకి ఉందని గట్టిగా నమ్ముతున్నా...’ అంటూ కామెంట్ చేశాడు టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా.
undefined
ఫైనల్ మ్యాచ్‌కి ముందు జరిగిన ఇంట్రా టీమ్ మ్యాచ్‌లో ఛతేశ్వర్ పూజారా తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ కలిసి మూడు రోజుల పాటు బ్యాటింగ్‌కి దిగాడు...
undefined
ఆస్ట్రేలియా టూర్ 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సాహోసోపేతమైన ఇన్నింగ్స్‌లతో మూడు హాఫ్ సెంచరీలు చేసిన పూజారా, సెంచరీ మార్కు మాత్రం అందుకోలేకపోయాడు.
undefined
అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరిగే సౌంతిప్టన్ స్టేడియంలో ఇప్పటిదాకా 37 మంది భారత బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తే, టెస్టుల్లో సెంచరీ చేసిన ఏకైక టీమిండియా ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఛతేశ్వర్ పూజారా...
undefined
click me!