రోహిత్ శర్మ అలా చేస్తే చాలు, టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ చేయగలడు... డేవిడ్ వార్నర్ సలహా...

First Published Jun 15, 2021, 9:41 AM IST

ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినా డేవిడ్ వార్నర్‌కి ఇండియన్ ఫ్యాన్స్ అన్నా, టీమిండియా అన్నా అభిమానం చాలా ఎక్కువే. విరాట్ కోహ్లీని మేం ఎవ్వరం అందుకోలేకపోమని చెప్పిన వార్నర్, ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోయే భారత జట్టుకి కొన్ని సలహాలు, సూచనలు చేశాడు...

‘రిషబ్ పంత్ ఆడుతున్న విధానం చూస్తుంటే నాకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ గుర్తుకు వస్తున్నాడు. గిల్లీ క్రీజులోకి వస్తూనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగేవాడు...
undefined
గిల్లీ అటాకింగ్‌తో ప్రత్యర్థి జట్టు వెనకడుగు వేసేది. ఇప్పుడు రిషబ్ పంత్ కూడా అలాంటి ఆటతీరే చూపిస్తున్నాడు. గబ్బా టెస్టులో కానీ, అంతకుముందు సిడ్నీ టెస్టులో కానీ పంత్ ఆడిన విధానం అద్భుతం...
undefined
రిషబ్ పంత్, మా సీనియర్ బౌలర్ల బౌలింగ్‌లో షాట్లు ఆడుతుంటే మా దగ్గర సమాధానం లేకపోయింది. అతను భవిష్యత్తులో సూపర్ స్టార్ అవుతాడు...
undefined
రోహిత్ శర్మకు వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అతనో వరల్డ్ క్లాస్ ప్లేయర్. టెస్టుల్లో రాణించలేడనే విమర్శను నేను ఒప్పుకోను. ఎందుకంటే అతని టెక్నిక్ అన్ని ఫార్మాట్లకు సరిగ్గా సరిపోతుంది.
undefined
అయితే టెస్టుల్లో కూడా అతను వన్డేల్లో సాధించిన విధంగా రాణించాలంటే ఫార్మాట్‌కి తగ్గట్టుగా కొద్దిగా ఆటలో మార్పులు చేసుకుంటే చాలు...
undefined
సెషన్స్ మారే కొద్దీ, బ్యాటింగ్ గేర్ మారుస్తూ ఉంటే చాలు. మొదటి సెషన్‌లో సెటిల్ అవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చి, రెండో సెషన్‌లో అటాక్ చేయాలి. మూడో సెషన్‌లో పూర్తిగా షాట్స్ మీదే ఫోకస్ పెట్టాలి...
undefined
ఇలా గేరు మారుస్తూ ఆడితే రోహిత్ శర్మ ఈజీగా టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ కూడా చేయగలడు.... అతని నుంచి త్వరలోనే ఆ స్కోరు వస్తుందనుకుంటున్నా...
undefined
విరాట్ కోహ్లీ ప్రెజెంట్ జనరేషన్‌లో క్రికెట్ సూపర్ స్టార్. ప్రస్తుత తరంలో ఎవ్వరూ సాధించలేకపోయిన రికార్డులెన్నో కోహ్లీ ఇప్పటికే సాధించేశాడు. అతని నుంచి త్వరలోనే 71వ సెంచరీ వస్తుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం. ఆ తర్వాతి మ్యాచ్‌లో వార్నర్‌కి జట్టులో చోటు కూడా దక్కలేదు...
undefined
దీంతో 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు వచ్చినా, తనను జట్టులో ఆడించరని, ఇక్కడి నుంచే జట్టును ఎంకరేజ్ చేస్తానంటూ ఓ అభిమాని ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు వార్నర్.
undefined
డేవిడ్ వార్నర్‌ను వచ్చే ఏడాది మెగా వేలానికి విడుదల చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2016 సీజన్‌లో సన్‌రైజర్స్‌ను టైటిట్ ఛాంపియన్‌గా నిలిపిన వార్నర్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్‌సీబీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు చాలాజట్లు పోటీపడే అవకాశం ఉంది.
undefined
click me!