డబ్ల్యూటీసీ విజయం ఇచ్చిన జోష్... టీ20 వరల్డ్‌కప్‌కి జట్టుని ప్రకటించిన న్యూజిలాండ్...

First Published Aug 11, 2021, 8:49 AM IST

21 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీని గెలిచిన జోష్ నుంచి న్యూజిలాండ్ ఇంకా బయటికి రాలేదు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచిన న్యూజిలాండ్, ఆ గదతో దేశమంతా తిరుగుతూ ఫోటోషూట్లు చేసుకుంటున్నారు. అదే ఊపులో, ఆ జోరు తగ్గకముందే టీ20 వరల్డ్‌కప్‌కి జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు...

అక్టోబర్‌లో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కు అందరి కంటే ముందుగా జట్టును ప్రకటించిన టాప్ టీమ్ న్యూజిలాండే... 

టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ టూర్లకి కూడా కలిపి 32 మంది ప్లేయర్లతో కూడిన జట్లను ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది న్యూజిలాండ్... 

టీ20 వరల్డ్‌కప్‌కి ప్రకటించిన15 మందితో కూడిన ఈ జట్టులో ఇష్ సోదీ, మిచెల్ సాంట్నర్‌, టిమ్ సౌథీతో పాటు ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫర్గూసన్, కేల్ జెమ్మీసన్, టాడ్ అస్లే వంటి టాప్ బౌలర్లకు చోటు దక్కింది...

21 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కి ఓ ఐసీసీ టైటిల్ అందించిన కేన్ విలియంసన్, టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఇండియా టూర్లకు కూడా నాయకత్వం వహించబోతున్నాడు...

15 మందితో జట్టుతో పాటు ఎవరైనా గాయపడితే అందుబాటులో ఉండేందుకు స్టాండ్‌బైగా 16వ ప్లేయర్‌ను ఎంపిక చేసింది న్యూజిలాండ్. ఆడమ్ మిల్నేకి టీ20 వరల్డ్‌కప్‌లో 16వ ప్లేయర్‌గా చోటు దక్కింది...

టీ20 వరల్డ్‌కప్‌కి న్యూజిలాండ్ జట్టు ఇది: కేన్ విలియంసన్, టాడ్ అస్లే, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డివాన్ కాన్వే, లూకీ ఫర్గూసన్, మార్టిన్ గప్టిల్, కేల్ జెమ్మీసన్, డార్లీ మిచెల్, జిమ్మీ నీశమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే

టీ20 వరల్డ్‌కప్, ఇండియా టూర్ ముగిసిన తర్వాత కెప్టెన్ కేన్ విలియంసన్ అండ్ సహాయక సిబ్బంది, కోచ్‌లకు విశ్రాంతి ఇవ్వనుంది కివీస్ బోర్డు...

బంగ్లాదేశ్‌తో టీ20, పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.  

బంగ్లాదేశ్‌తో టీ20, పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కి న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్, ఫిన్ ఆలెన్, హమిశ్ బెన్నెట్, టామ్ బ్లండెల్, డౌగ్ బ్రేస్‌వెల్, కోలిన్ డి గ్రాండ్‌‌హోమ్, జాకోబ్ డఫ్పీ, స్కాట్ కుగ్గేలిజిన్, కోలి మక్‌కాంగచీ, హెన్రీ నికోలస్, అజత్ పటేల్, రచిన్ రవీంద్ర, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్, బెన్ సీయర్స్ (టీ20లకు మాత్రమే), మాట్ హెన్రీ (వన్డేలకు మాత్రమే)

పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కి న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ ఆలెన్, టాడ్ అస్లే, హమీశ్ బెన్నెట్, టామ్ బ్లండెల్, మార్క్ చాప్‌మన్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్టిల్, మాట్ హెన్రీ, మార్ల్ మిచెల్, అజత్ పటేల్, ఇష్ సోదీ, బెన్ సియర్స్, బ్లెయర్ టక్నర్, విల్ యంగ్

టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ 2లో ఉన్న న్యూజిలాండ్, టీమిండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు మరో రెండు జట్లతో మ్యాచులు ఆడనుంది. టీమిండియా, పాకిస్తాన్‌తో పాటు ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్ కోసం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు...

2015 వన్డే వరల్డ్‌కప్, 2019 వన్డే వరల్డ్‌కప్‌, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆశగా ఎదురుచూస్తున్నారు భారత అభిమానులు...

click me!