పేరు కంటే ఫామ్ ముఖ్యం! కెఎల్ రాహుల్ కోలుకున్నా, ఇషాన్ కిషన్‌నే ఆడించాలి.. - గౌతమ్ గంభీర్

Published : Sep 03, 2023, 04:07 PM IST

కెఎల్ రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. ఓపెనర్‌గా అదరగొడుతున్నా మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్‌కి పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేదు..  

PREV
19
పేరు కంటే ఫామ్ ముఖ్యం! కెఎల్ రాహుల్ కోలుకున్నా, ఇషాన్ కిషన్‌నే ఆడించాలి.. - గౌతమ్ గంభీర్
Ishan Kishan-Hardik Pandya

ఇషాన్ కిషన్ ఎలాగో మిడిల్ ఆర్డర్‌లో ఫెయిల్ అవుతాడు? కెఎల్ రాహుల్ కోలుకోగానే సీనియారిటీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కోటాలో అతన్ని తుది జట్టులోకి తీసుకురావచ్చని టీమిండియా భావించింది..

29

అయితే వెస్టిండీస్ టూర్‌లో వన్డేల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్, అదే ఫామ్‌ని కొనసాగిస్తూ... పాకిస్తాన్‌పై మిడిల్ ఆర్డర్‌లో అదరగొట్టాడు. 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, ఆసియా కప్ చరిత్రలో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

39

ఈ ప్రదర్శనతో ఇప్పుడు టీమిండియాకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. వన్డేల్లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ని తప్పిస్తే కానీ, కెఎల్ రాహుల్‌ని తుది జట్టులోకి తీసుకురాలేని పరిస్థితి. రిషబ్ పంత్ ఫిట్‌గా ఉండి ఉంటే, ఈ ఇద్దరికీ అతనే చెక్ పెట్టేవాడు..
 

49

‘కెఎల్ రాహుల్ మ్యాచ్ విన్నర్. అతను వన్డేల్లో నెం.5 ప్లేస్‌లో అదరగొడుతున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో మహ్మద్ షమీని తప్పించినట్టే, కెఎల్ రాహుల్ ఫిట్‌గా ఉంటే ఇషాన్ కిషన్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడతారు...’ అంటూ కామెంట్ చేశాడు కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...
 

59

కైఫ్ వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే, ఇదే మాట మాట్లాడతారా? కెఎల్ రాహుల్ కోసం వాళ్లను పక్కనబెట్టే సాహసం చేస్తారా?
 

69

మనం వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి పేరుని కాకుండా ఫామ్‌ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడు వరల్డ్ కప్ టైటిల్ గెలవగలం. కోహ్లీ, రోహిత్ ఫెయిల్ అయిన ప్లేస్‌లో ఇషాన్ కిషన్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు..

79

కేవలం కెఎల్ రాహుల్ ఎక్కువ మ్యాచులు ఆడాడనే ఉద్దేశంతో ఇషాన్ కిషన్‌ని తుది జట్టు నుంచి తప్పించడం కరెక్ట్ కాదు. గాయాల కారణంగా చాలా మంది ప్లేయర్లు తుది జట్టులో చోటు కోల్పోయారు. వాళ్లు రీఎంట్రీ ఇవ్వాలంటే ఎదురుచూడక తప్పదు..

89

కెఎల్ రాహుల్, ఐదో స్థానంలో నిరూపించుకుని ఉండొచ్చు. కానీ ఇషాన్ కిషన్ ఇప్పుడున్న ఫామ్‌ని టీమిండియా వాడుకోవాలి. పాకిస్తాన్ బౌలింగ్ అటాక్‌ని అతను ఎదుర్కొన్న విధానం అద్భుతం...

99

టాపార్డర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం కూడా ఇషాన్ కిషన్ సక్సెస్‌కి కారణం కావచ్చు. రైట్ హ్యాండ్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఉండి ఉంటే, అలాంటి ఇన్నింగ్స్ వచ్చి ఉండేది కాదేమో..’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..

 

click me!

Recommended Stories