ఇండియా వర్సెస్ నేపాల్‌ మ్యాచ్‌కి కూడా తప్పని వరుణ గండం... అది కూడా రద్దయితే టీమిండియా పరిస్థితి ఏంటి?..

Published : Sep 03, 2023, 03:46 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా శతాధిక భాగస్వామ్యం వల్ల 266 పరుగుల స్కోరు చేయగలిగింది..  

PREV
16
ఇండియా వర్సెస్ నేపాల్‌ మ్యాచ్‌కి కూడా తప్పని వరుణ గండం... అది కూడా రద్దయితే టీమిండియా పరిస్థితి ఏంటి?..

టీమిండియా 250+ స్కోరు దాటడంతో బౌలర్లు, మొదటి 10 ఓవర్లలో 2 వికెట్లు తీసినా గెలిచే అవకాశాలు ఉండేవి. అయితే వర్షం కారణంగా పాకిస్తాన్‌ బ్యాటింగ్‌కి రాకుండానే మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో ఇండియా, పాకిస్తాన్ జట్లకు చెరో పాయింట్ లభించింది..

26

ముల్తాన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో నేపాల్‌పై 238 పరుగుల భారీ తేడాతో గెలిచిన పాకిస్తాన్, 3 పాయింట్లతో సూపర్ 4 రౌండ్‌లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. టీమిండియా, నేపాల్‌తో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే టేబుల్ టాపర్‌గా సూపర్ 4 రౌండ్‌కి చేరుకుంటుంది. 
 

36
India Vs Pakistan

అయితే పల్లెకెలెలో సోమవారం (సెప్టెంబర్ 4న) కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాత తెలియచేసింది. పల్లెకెలెలో సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో విరివిగా వర్షాలు కురుస్తాయి. సోమవారం 70 శాతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది..

46
India vs Pakistan Rain

ఒకవేళ వర్షం కారణంగా నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్ కూడా ఫలితం తేలకుండా రద్దు అయితే టీమిండియా 2 పాయింట్లతో సూపర్ 4 రౌండ్‌కి చేరుకుంటుంది. అయితే 3 పాయింట్లతో ఉన్న పాకిస్తాన్ A1గా మారితే, టీమిండియా A2గా సూపర్ 4 రౌండ్ ఆడాల్సి ఉంటుంది.. 

56

ఒకవేళ మ్యాచ్ ఆరంభమై, నేపాల్‌కి అనుకూలంగా ఉన్నప్పుడు వర్షం కురిసే మ్యాచ్ మధ్యలో ఆగిపోతే, డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ ఫలితం నిర్ణయించబడుతుంది. అదే జరిగితే టీమిండియాకి ఊహించని షాక్ తగిలినా తగలొచ్చు.. 
 

66

A2గా టీమిండియా, సూపర్ 4 రౌండ్‌కి చేరితే సెప్టెంబర్ 10న పాకిస్తాన్‌తో, సెప్టెంబర్ 12న బీ1 టీమ్‌తో, సెప్టెంబర్ 15న బీ2 టీమ్‌తో మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.. ఈ మూడింట్లో కనీసం రెండు మ్యాచుల్లో గెలిస్తే ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి.. 

click me!

Recommended Stories