నాకు ధోనీ అయినా ఒకటే, కోహ్లీ అయినా ఒకటే! నవీన్ వుల్ హక్‌కి అందుకే సపోర్ట్ చేశా... - గౌతమ్ గంభీర్

Published : Jun 12, 2023, 03:57 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ, చాలా పెద్ద దుమారమే క్రియేట్ చేసింది. ఆ రోజు ప్రవర్తించిన విధానం కారణంగా కోహ్లీపైన తీవ్ర విమర్శలు వస్తే, గంభీర్‌ని టార్గెట్ చేసి ట్రోల్ చేశారు విరాట్ ఫ్యాన్స్...

PREV
17
నాకు ధోనీ అయినా ఒకటే, కోహ్లీ అయినా ఒకటే! నవీన్ వుల్ హక్‌కి అందుకే సపోర్ట్ చేశా... - గౌతమ్ గంభీర్

విరాట్ కోహ్లీతో అప్పుడెప్పుడో పదేళ్ల క్రిందట ఐపీఎల్‌లో జరిగిన గొడవను మనసులో పెట్టుకునే గౌతమ్ గంభీర్.. ఈ విధంగా అతన్ని ఇప్పటికీ టార్గెట్ చేస్తున్నాడని అన్నారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్. దీనిపై తాజాగా స్పందించాడు గౌతమ్ గంభీర్...
 

27

‘విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ ఇద్దరితో నా రిలేషన్ ఒకేలా ఉంటుంది. నాకు ఇద్దరూ సమానమే. ఒకవేళ మాకు ఏదైనా గొడవ, వాగ్వాదం జరిగితే అది ఫీల్డ్ వరకూ మాత్రమే ఉంటుంది, ఆఫ్ ఫీల్డ్‌లో దాన్ని పట్టించుకోం..

37

నాకు వ్యక్తిగతంగా కోహ్లీతో కానీ, ధోనీతో కానీ ఎలాంటి గొడవలు లేవు. నేను మ్యాచ్ గెలవాలని ఎంతగా కోరుకుంటానో, వాళ్లు కూడా అంతే కోరుకుంటారు. నేను దాన్ని గౌరవిస్తాను.. నేను క్రికెట్ ఫీల్డ్‌లో చాలా గొడవలు పడ్డాను. అయితే ఏదీ కూడా హద్దులు దాటలేదు..

47
Gautam Gambhir

టీఆర్పీ కోసం మీడియా చాలాసార్లు ఈ విషయాన్ని పెద్దగా చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న వాగ్వాదం జరిగినా దాన్ని భూతద్ధంలో చూపించి, సొమ్ము చేసుకోవాలని చూస్తారు. అయితే క్రికెట్‌ గ్రౌండ్‌లో కాకుండా బయట ఇలా గొడవపడితే అది నిజంగా గొడవ అవుతుంది...

57
Gautam Gambhir

క్రికెట్ మ్యాచ్‌లో గెలవాలని అనుకునే ఇద్దరు వ్యక్తుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగితే అది కూడా ఆటలో భాగమే. నేనెప్పుడూ సాధ్యం అయినంత వరకూ న్యాయం ఉన్నవారి వైపే నిలబడతా. ఒకవేళ నవీన్ వుల్ హక్ ఆ రోజు తప్పు చేయలేదని నాకు అనిపిస్తే, అతని తరుపున నిలబడాల్సిన బాధ్యత నాది..

67
Virat Kohli-Gautam Gambhir

నువ్వు సరిగా ఉంటే, నా సపోర్ట్ నీకు ఉందని చెప్పాలి. నా జీవితంలో కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతా. చాలా మంది చాలా రకాలుగా చెబుతారు. మన సొంత ప్లేయర్లను సపోర్ట్ చేయకుండా, నవీన్ వుల్ హక్‌ని సపోర్ట్ చేస్తున్నావని అన్నారు...

77

అయితే ఇక్కడ సమస్య మన ప్లేయర్లా, ఫారిన్ ప్లేయర్లా అనేది కాదు. ఒకవేళ నా టీమ్ ప్లేయర్ వైపు తప్పు ఉంటే, కచ్చితంగా ఆ రోజు విరాట్ కోహ్లీకి మద్ధతుగా నిలబడేవాడిని..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..

Read more Photos on
click me!

Recommended Stories