ఇక కోచ్‌గా చేయను, ఆ కథ ముగిసింది... టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

Published : Sep 17, 2022, 02:13 PM IST

టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్‌ హెడ్ కోచ్‌లలో రవిశాస్త్రి ఒకడు. ఐసీసీ టైటిల్ గెలవలేకపోయినప్పటికీ రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టు విదేశాల్లో అద్భుత విజయాలు అందుకుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019-21 సీజన్‌లో ఫైనల్‌ చేరింది. 

PREV
18
ఇక కోచ్‌గా చేయను, ఆ కథ ముగిసింది... టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టులో 36/9 ఘోర పరాభవం తర్వాత అద్భుత విజయాలతో 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది భారత జట్టు. బ్రిస్బేన్‌ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లేకుండా ఆసీస్‌ని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది టీమిండియా...

28
Image credit: Getty

2014-16 సీజన్లలో టీమిండియా డైరెక్టర్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే తర్వాత 2017లో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు... టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఆ పదవి నుంచి తప్పుకున్నాడు శాస్త్రి...

38
Ravi Shastri and Virat Kohli

రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ హయాంలో భారత జట్టు రిజర్వు బెంచ్ అత్యంత పటిష్టంగా తయారైంది. ముఖ్యంగా భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ యూనిట్‌గా తయారైంది...

48

అయితే కోచ్‌గా ఎన్ని విజయాలు సాధించినా తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేశాడు రవిశాస్త్రి. టీమిండియా మ్యాచ్‌లు ఓడిన ప్రతీసారీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని, రవిశాస్త్రి కోచింగ్‌ స్టైల్‌ని తీవ్రంగా విమర్శించేవాళ్లు అభిమానులు. రవిశాస్త్రిని ఎప్పుడు తప్పిస్తారంటూ బీసీసీఐని నిలదీసిన సందర్భాలు కోకొల్లలు...

58

ఈ పరిణామాల కారణంగానే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత కాంట్రాక్ట్ గడువు పొడగించాలని బీసీసీఐ భావించినా, రవిశాస్త్రి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు...

68
Rahane-Ravi Shastri

‘నా కోచింగ్‌ టైమ్ ముగిసింది. ఏడేళ్లు నేనేం చేయగలనో అంతా చేశా... ప్రస్తుతం నా కంపెనీకి నేనిప్పుడు కోచింగ్‌గా చేస్తున్నా, అది చాలా చిన్నది. దానికి తప్ప మళ్లీ కోచింగ్ చేసే ఆలోచన నాకు లేదు...

78

కోచ్‌గా చేసిన కాలాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశా. మళ్లీ దాని జోలికి వెళ్లాలని లేదు. ఇప్పుడు నేను గేమ్‌ని చూస్తూ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా... అంతే...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

88

అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్‌గా తప్పించిన పంజాబ్ కింగ్స్, రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమించాలని భావించింది. అయితే రవిశాస్త్రి కోచ్‌గా చేసేందుకు అంగీకరించకపోవడంతో అనిల్ కుంబ్లే ప్లేస్‌లో ట్రేవర్ బేలిస్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పంజాబ్ కింగ్స్...

click me!

Recommended Stories