IPL: ఐపీఎల్ లో ఆ జట్టే నాకు అతిపెద్ద స్ఫూర్తి : లక్నో ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Dec 19, 2021, 04:24 PM IST

IPL 2022: ఐపీఎల్ లోకి ఎన్ని కొత్త జట్లు వచ్చినా.. ఎవరెన్ని ట్రోఫీలు కొట్టినా రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ కు ఉండే క్రేజే వేరు...

PREV
18
IPL: ఐపీఎల్ లో ఆ జట్టే నాకు అతిపెద్ద స్ఫూర్తి : లక్నో ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఎన్ని కొత్త జట్లు వచ్చినా.. ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలు ఘనమైన విజయాలు అందుకున్నా.. ఐదు సార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు ఉండే క్రేజే వేరు. 

28

ఆటగాళ్లు, అభిమానులే కాదు.. తాజాగా ఐపీఎల్ లో  లక్నో ఫ్రాంచైజీని చేజిక్కించుకున్న ఆర్పీఎస్జీ యజమాని సంజీవ్ గొయెంకా కూడా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ లిస్ట్ లో  చేరాడు. 

38

ఆ జట్టు అనుసరిస్తున్న స్ట్రాటజీని ఒక్క ఐపీఎల్ లోనే కాదని, ప్రపంచంలోని అన్ని క్రీడా ఫ్రాంచైజీలు ఫాలో కావాలని సూచించాడు. అలాగే మెగా వేలానికి సంబంధించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

48

గొయెంకా మాట్లాడుతూ... ‘ఐపీఎల్ లో నాకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతి పెద్ద స్ఫూర్తి. ఇన్నాళ్లుగా వాళ్లు ఏం సాధించారు..? వాళ్ల విజయరహస్యం ఏమిటి..? వారి ప్రయాణం ఎలా సాగుతుంది..? అనేది ఒక్క ఐపీఎల్ లోనే కాదు.. ప్రపంచంలోని క్రీడా ఫ్రాంచైజీలు  అన్ని అనుసరించాల్సిన విధానం...’ అని అన్నాడు. 

58

మెగా వేలంపై స్పందిస్తూ.. ‘నేను ఆ వ్యవస్థ (ఐపీఎల్ మెగా యాక్షన్స్) ను పాటించాలి. అందులో నా పాత్ర ఏమీ లేదు. కానీ  ఐపీఎల్ మెగా వేలం  అనే భావన నుంచి బయటపడాలి.  వేలం అనే భావనను ఐపీఎల్ మించిపోయింది..’ అని తెలిపాడు. 

68

ఇదిలాఉండగా లక్నో టీమ్ కు మెంటార్ గా ఎంపికైన మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ పై కూడా గొయెంకా ప్రశంసలు కురిపించాడు. ‘గంభీర్ చాలా కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఫ్రాంచైజీని ఎక్కువ కాలం నిలిపేందుకు అతడు కృషి  చేస్తాడని నమ్ముతున్నాం.. 

78

గతంలో  ఎన్నో విజయాలు సాధించిన  గంభీర్ వంటి వ్యక్తులు మాకు అవసరం..’అని చెప్పాడు. గంభీర్ మెంటార్ గా.. జింబాబ్వే లెజెండరీ ఆటగాడు ఆండీ ఫ్లవర్ ను ఆ జట్టు  హెడ్ కోచ్ గా  నియమించుకున్న విషయం తెలిసిందే.  

88

ఇక తన నియామకంపై గంభీర్ మాట్లాడుతూ.. ‘విజయాగ్ని ఇంకా నాలో రగులుతూనే ఉంది.  విజేతల వారసత్వాన్ని విడిచిపెట్టినందుకు నేను ఇప్పటికీ నిత్యం బాధపడుతూనే ఉంటాను. నేను డ్రెస్సింగ్ రూమ్ (లక్నో) కోసం పనిచేయను. ఉత్తరప్రదేశ్ ఆత్మ కోసం పాటు పడతాను..’ అని తెలిపాడు.

click me!

Recommended Stories