IPL 2025 : బై బై ఎల్ఎస్జీ.. కేఎల్ రాహుల్ ఏం టీమ్ లో చేర‌బోతున్నాడు?

First Published Oct 30, 2024, 7:02 PM IST

LSG IPL 2025 Retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే ఎడిషన్ కోసం ఆటగాళ్ల రిటెన్షన్‌ల జాబితాను అందించ‌డానికి బీసీసీఐ అక్టోబ‌ర్ నేలాఖ‌రు వ‌ర‌కు గ‌డువు విధించింది. ఈ క్ర‌మంలోనే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) రిటెన్ష‌న్ లిస్టు గురించి ఆస‌క్తిక‌ర‌మైన విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. 
 

LSG IPL 2025 Retention: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజ‌న్ కు ముందు ఆట‌గాళ్ల కోసం మెగా వేలం నిర్వ‌హించ‌నుంది. దీని ముందు అన్ని ఫ్రాంఛైజీలు త‌న రిటెన్ష‌న్ల వివ‌రాల‌ను అందించ‌డానికి అక్టోబ‌ర్ నేలాఖ‌రును తుది గ‌డువుగా విధించింది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ). దీంతో అన్ని టీమ్స్ త‌న రిటెన్ష‌న్ జాబితాను బీసీసీఐకి అందించ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) కూడా త‌మ లిస్టును అందించ‌నుంది.

KL Rahul , India,

ఎల్ఎస్జీ రిటెన్ష‌న్ల లిస్టుకు సంబంధించి ఆసక్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ల‌క్నో టీమ్ కు భార‌త స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ బై బై చెప్పిన‌ట్టు ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. భార‌త‌ క్రికెట్ స‌ర్కిల్ లో కూడా ఇదే విష‌యం హాట్ టాపిక్ అవుతోంది. 

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అత‌న్ని త‌మ జ‌ట్ల‌లోకి తీసుకోవ‌డానిక ప‌లు ఫ్రాంఛైజీలు ఆస‌క్తిని చూపుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) కెఎల్ రాహుల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. 

Latest Videos


గ‌త IPL మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.18 కోట్లతో ఒప్పందం చేసుకుంది. అతను ఫ్రాంచైజీకి కెప్టెన్ కూడా అయ్యాడు. కేఎల్ రాహుల్ మూడు ఐపీఎల్ సీజ‌న్ల‌ల‌లో రెండు సార్లు జ‌ట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. అయితే, ఐపీఎల్ 2024 సీజ‌న్ లో ఆ జ‌ట్టు య‌జ‌మాని, కేఎల్ రాహుల్ మ‌ధ్య చోటుచేసుకున్న ఘ‌ట‌న క్రీడా వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. 

ఇటీవలి ప‌లు మీడియా నివేదిక ప్రకారం.. కేఎల్ రాహుల్ వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలను చూపుతూ లక్నో సూపర్ జెయింట్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. కేఎల్ రాహుల్‌కు టాప్ రిటెన్షన్ స్లాట్ ఇవ్వడానికి ఫ్రాంచైజీ సిద్ధంగా ఉంది. అయినప్పటికీ జ‌ట్టును వీడాల‌ని అత‌ను నిర్ణ‌యించుకున్నాడు. అయితే, ఈ విషయంపై లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

కేఎల్ రాహుల్‌పై క‌న్నేసిన 4 ఫ్రాంచైజీలు

ల‌క్నో టీమ్ ను వీడాల‌నే నిర్ణ‌యంతో ఈసారి IPL వేలంలో కేఎల్ రాహుల్ కనిపించనున్నాడు. ఇది అన్ని ఫ్రాంఛైజీలను ఆకర్షిస్తుందని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప‌లు నివేదికల‌ ప్రకారం కేఎల్ రాహుల్ కోసం నాలుగు ఫ్రాంచైజీలు సన్నాహాలు చేశాయి.

కేఎల్ రాహుల్ ద‌క్కించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న టీమ్స్ లో విరాట్ కోమ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ), శుభ్ మ‌న్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) ముందంజలో ఉన్నాయి. వేలంలో నాలుగు జట్లు అతని కోసం వేలం వేస్తాయని భావిస్తున్నారు.

కేఎల్ రాహుల్ లక్నో టాప్ స్కోరర్

కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 4,683 పరుగులు చేశాడు. 45 సగటు, 134 స్ట్రైక్ రేట్ తో అతని బ్యాటింగ్ కొన‌సాగింది. 2019 నుండి 140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేయక‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఈ  కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 14 మ్యాచ్‌లలో 37.14 సగటు, 136.13 స్ట్రైక్ రేట్‌తో 520 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు 50+ స్కోర్లు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 82 పరుగులు.

ఆర్సీబీ నుంచి ఐపీఎల్ అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్ 

కేఎల్ రాహుల్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) త‌ర‌ఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అతను ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా ఆడాడు. 2016లో మ‌ళ్లీ ఆర్సీబీకి తిరిగి వచ్చాడు. రాహుల్ 2018లో కింగ్స్ XI పంజాబ్‌లో చేరాడు. అక్క‌డ అతను జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. పంజాబ్‌తో నాలుగు సీజన్లలో మంచి ఇన్నింగ్స్ ల‌తో పరుగులు సాధించాడు. అయితే, నిరంతరం పరుగులు చేసినప్పటికీ అతను ఏ జట్టును ఛాంపియన్‌గా చేయలేకపోయాడు.

click me!