షాహిద్ ఆఫ్రిదీ మామూలోడు కాదు... మెగా స్టార్ లీగ్ పేరుతో సెలబ్రేటిలతో కొత్త లీగ్...

Published : Apr 26, 2022, 03:30 PM IST

పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ పేరు చెప్పగానే చాలామందికి 37 బంతుల్లో సెంచరీ కొట్టిన ఇన్నింగ్సే గుర్తుకు వస్తుంది. రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ రీఎంట్రీ ఇచ్చి... సుదీర్ఘ కాలం క్రికెట్‌లో కొనసాగిన షాహిద్ ఆఫ్రిదీ... ఈ ఏడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు...

PREV
18
షాహిద్ ఆఫ్రిదీ మామూలోడు కాదు... మెగా స్టార్ లీగ్ పేరుతో సెలబ్రేటిలతో కొత్త లీగ్...

ఐపీఎల్‌ 2008లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన షాహిద్ ఆఫ్రిదీ... పాక్ సూపర్ లీగ్‌తో పాటు టీ20 బిగ్‌బాష్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగుల్లో పాల్గొన్నాడు...

28
Shahid afridi

అంతర్జాతీయ కెరీర్‌లో 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 మ్యాచులు ఆడిన షాహిద్ ఆఫ్రిదీ, అన్ని రకాల ఫార్మాట్ నుంచి తప్పుకుంటూనే సొంతంగా ఓ క్రికెట్‌ లీగ్‌‌నే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు...

38

మెగా స్టార్ లీగ్ (ఎమ్‌ఎస్‌ఎల్) పేరుతో క్రికెట్ లీగ్‌ను ప్రారంభించిన షాహిద్ ఆఫ్రిదీ... ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ వుల్ హక్, వకార్ యూనిస్ వంటి పాక్ మాజీ క్రికెటర్లతో కలిసి టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు...

48

ఈ మెగా స్టార్ లీగ్‌లో పాకిస్తాన్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో మాజీ క్రికెటర్లు మాత్రమే కాకుండా చలన చిత్ర, సంగీత రంగానికి సంబంధించిన సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు, రాక్ స్టార్లు పాల్గొనబోతున్నట్టు ప్రకటించాడు ఆఫ్రిదీ...

58

ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లతో పాటు మాజీ అథ్లెట్లు, జర్నలిస్టులకు అవసరమైన ఆర్థిక సాయం చేసేందుకు ఈ మెగా స్టార్ లీగ్‌ను నిర్వహించబోతున్నట్టు ప్రకటించాడు ఆఫ్రిదీ...

68

పాకిస్తాన్‌లో రావల్పిండి వేదిగా వచ్చే సెప్టెంబర్ నెలలో మెగా స్టార్ లీగ్ ప్రారంభమవుతుందని... ఇందులో ఆరు టీమ్‌లు ఉంటాయని ప్రకటించాడు షాహిద్ ఆఫ్రిదీ...

78

‘మెగా స్టార్ లీగ్ పక్కా ఎంటర్‌టైయినింగ్ లీగ్. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రావల్సిండి వేదికగా ఈ లీగ్ నిర్వహిస్తాం. ఇందులో ఆరుజట్లు ఉంటాయి. విదేశీ ప్లేయర్లు కూడా ఆడబోతున్నారు.. 

88

పాక్ సూపర్ లీగ్ అనేది కేవలం యంగ్‌స్టర్స్ కోసమే, ఇప్పుడు నేను యంగ్‌స్టర్‌ని కాదు. అందుకే నేను, ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ వుల్ హక్, వకార్ యూనిస్... ఎమ్‌ఎస్‌ఎల్‌లో ఆడతాం...’ అంటూ కామెంట్ చేశాడు షాహిద్ ఆఫ్రిదీ...

click me!

Recommended Stories