ధోనీ తలా, కోహ్లీ కింగ్ అయితే శిఖర్ ధావన్ టీ20కా ఖలీఫా... గబ్బర్‌పై మహ్మద్ కైఫ్ ట్వీట్...

First Published Apr 26, 2022, 2:07 PM IST

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ఒకడిగా ఉన్నప్పటికీ శిఖర్ ధావన్‌కి రావాల్సినంత క్రేజ్ అయితే రాలేదు. కారణం ఒక్కటే స్ట్రైయిక్ రేటు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీల్లా శిఖర్ ధావన్ బౌలర్లను ఊచకోత కోయడు. అయితే క్లాస్ షాట్స్‌ ఆడడంతో గబ్బర్, ఈ ముగ్గురి కంటే టాప్‌లోనే ఉంటాడు...

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి పెద్దగా అనుకూలించని పిచ్‌పై 59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు శిఖర్ ధావన్...

భనుక రాజపక్షతో కలిసి రెండో వికెట్‌కి 110 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన శిఖర్ ధావన్.. పంజాబ్ కింగ్స్ 187 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు...

Latest Videos


Shikhar Dhawan

ఐపీఎల్‌లో 200వ మ్యాచ్ ఆడుతున్న శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తర్వాత 6 వేల క్లబ్‌లో చేరిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా టీ20ల్లో 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు...

శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌పై స్పందించిన భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్... ‘ధోనీ తలా... కోహ్లీ కింగ్ అయితే శిఖర్ ఏంటి? ఐపీఎల్‌లో 6 వేల పరుగులు... అది కూడా ఓపెనింగ్ ప్రెషర్‌లో. అతను టీ20 కా ఖలీఫా...

శిఖర్ ధావన్ టీ20 వరల్డ్ కప్ ఆడాలి. ఏ ప్లేస్‌లో ఆడాలని అని నన్ను అడగకండి. నేను సెలక్టర్‌ని అయ్యి ఉంటే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాడిని...’ అంటూ ట్వీట్ చేశాడు...

Image Credit: Getty Images

‘శిఖర్ ధావన్ ఎప్పుడూ ప్రెషర్‌ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఏ ఫ్రాంఛైజీకి ఆడుతున్నామనేది పట్టించుకోకుండా నిలకడగా రాణిస్తున్నాడు. పరిస్థితిని, పిచ్‌ని అర్థం చేసుకుని ఆడగలడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

Shikhar Dhawan

ఐపీఎల్‌ 2019, 2020, 2021 సీజన్‌లో 500+ పైగా పరుగులు చేసినప్పటికీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన భారత జట్టులో శిఖర్ ధావన్‌కి చోటు దక్కలేదు...

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలతో పాటు ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు ఓపెనింగ్ పొజిషన్ కోసం పోటీలో నిలవడంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కూడా శిఖర్ ధావన్‌కి చోటు దక్కడం అనుమానమే...

click me!