ఆ రనౌట్ కోసం ప్రయత్నిస్తే, మీ కెరీర్ ఎండ్ కావచ్చు... ఐపీఎల్‌ 2022 ముందు అశ్విన్ కామెంట్స్...

Published : Mar 17, 2022, 04:53 PM IST

ఐపీఎల్ 2019, పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్... పంజాబ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌కి వచ్చి, జోరు మీదున్న జోస్ బట్లర్‌ని ‘మన్కడింగ్’ పద్ధతిలో అవుట్ చేయడం పెద్ద దుమారమే రేపింది. కొందరు అశ్విన్ చేసిన దాన్ని సమర్థిస్తే, మరికొందరు క్రీడా స్ఫూర్తికి విరుద్దమంటూ విమర్శించారు...

PREV
110
ఆ రనౌట్ కోసం ప్రయత్నిస్తే, మీ కెరీర్ ఎండ్ కావచ్చు... ఐపీఎల్‌ 2022 ముందు అశ్విన్ కామెంట్స్...

ఐపీఎల్ 2019 తర్వాత మన్కడింగ్ గురించి ఎప్పుడు చర్చ వచ్చినా, రవిచంద్రన్ అశ్విన్ - జోస్ బట్లర్‌ల మధ్య సంఘటన గురించి మొదట ప్రస్తావన వచ్చింది..

210

మేరీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కొత్తగా 2022 లా కోడ్‌లో చేసిన మార్పులను బట్టి, ఇకపై మన్కడింగ్‌ అనే పదం ఉండదు.  బంతి వేయడానికి ముందే బ్యాటర్ క్రీజు దాటితే, రనౌట్ చేసే అవకాశం బౌలర్‌కి ఉంటుంది...

310

ఇంతకుముందు లా 41 (అన్‌ఫెయిర్ ప్లే)గా ఉన్న మన్కడింగ్‌ని లా 38కి మారుస్తూ రనౌట్‌ కిందే పరిగణిస్తామని, ఇందులో క్రీడా స్ఫూర్తికి భంగం కలిగించే విషయమేమీ లేదని తేల్చారు...

410

తాజాగా దీని గురించి మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్... ‘ఈ మార్పు బౌలర్లకు కాస్త ఆతృతకి గురి చేయొచ్చు. ముఖ్యంగా చాలా మంది బౌలర్లు, నాన్‌స్ట్రైయికింగ్ బ్యాటర్‌ను గమనించి, రనౌట్ చేసే అవకాశం కోసం చూస్తారు...

510

అయితే నాన్‌స్ట్రైయికర్ కంటే స్ట్రైయికర్‌లో ఉన్న బ్యాటర్‌పై ఫోకస్ పెట్టడం చాలా అవసరం. నాన్‌స్ట్రైయికర్‌పై ఫోకస్ పెడుతూ, కరెక్ట్ బాల్ వేయకపోతే బ్యాటర్ సిక్సర్లు కొట్టే అవకాశం ఉంటుంది...

610

నాన్‌ స్ట్రైయికర్ అప్‌సెట్‌లో ఉంటాడని బౌలర్ భావిస్తే, అది అతన్నే అప్‌సెట్ చేయొచ్చు... గీత దాటి అడుగు ముందుకు వేస్తే, వారి కెరీర్‌ మారిపోవచ్చు...

710

నాన్‌స్ట్రైయికర్‌ని గమనిస్తూ బ్యాటర్‌కి సిక్స్ ఇస్తే, ఆ తర్వాతి మ్యాచ్‌లో మీకు తుదిజట్టులో ప్లేస్ కూడా ఉండకపోవచ్చు... కాబట్టి ఈ రూల్‌ని మీకు అడ్వాంటేజ్‌గా చూడకండి...

810

ఈ రనౌట్ తప్పకుండా బౌలర్లకు ఉపకరిస్తుంది... అయితే అది సమయాన్ని బట్టి, సందర్భోచితంగా వాడాలి...’ అంటూ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

910

ఐపీఎల్ 2019 సీజన్‌లో అశ్విన్ చేతుల్లో మన్కడింగ్‌కి గురైన జోస్ బట్లర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోబోతున్నాడు ఈ ఆల్‌రౌండర్...

1010

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.5 కోట్లకు కోనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. కెప్టెన్ సంజూ శాంసన్‌తో పాటు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్‌లను రిటైన్ చేసుకుంది ఆర్ఆర్...

click me!

Recommended Stories