సఫారీ టీ20 లీగ్‌లో ఎంఎస్ ధోనీ... బీసీసీఐ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్న మాహీ...

First Published Aug 11, 2022, 12:40 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఐపీఎల్ తప్ప, ఏ క్రికెట్ లీగ్‌లోనూ ఆడడం లేదు ఎంఎస్ ధోనీ. సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి క్రికెటర్లు దేశవాళీ టోర్నీల్లో పాల్గొంటుంటే, మాహీ మాత్రం ఐపీఎల్‌తో సరిపెట్టుకుంటున్నాడు. అయితే మాహీ త్వరలో సఫారీ టీ20 లీగ్‌లో ఆడబోతున్నాడని వార్తలు వస్తున్నాయి...

Dhoni-Uthappa

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫ్రాంఛైజీలన్నీ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల యజమానులే. ముంబై ఇండియన్స్‌కి చెందిన టీమ్‌కి ‘ఎంఐ కేప్‌ టౌన్’ అని పేరు పెట్టగా, చెన్నై సూపర్ కింగ్స్‌ ఫ్రాంఛైజీ పేరును ఈ వారంలో ప్రకటించబోతున్నారు...

చెన్నై సూపర్ కింగ్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, సౌతాఫ్రికా టీ20 టీమ్‌కి కూడా హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడని ఇప్ఫటికే అధికారికంగా ప్రకటించింది సీఎస్‌కే. తాజాగా సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సఫారీ టీమ్‌కి కూడా కెప్టెన్సీ చేయబోతున్నాడనే వార్త.. తెగ వైరల్ అవుతోంది...

బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు ఎవ్వరూ విదేశీ లీగుల్లో పాల్గొనడానికి వీల్లేదు. ఒకవేళ అలా ఆడితే వారికి దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్ ఆడే అవకాశం కూడా ఉండదు.. అయితే టీమిండియా రిజర్వు బెంచ్ రోజురోజుకీ మరింత పటిష్టంగా మారుతుండడంతో ఈ నిబంధనను సడలించాలని చూస్తోంది బీసీసీఐ...

భారత జట్టులో చోటు దక్కని ప్లేయర్లకు విదేశీ లీగుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. దీంతో ఎంఎస్ ధోనీ, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముఖ్య పాత్ర పోషించబోతున్నాడని, దీనికి బీసీసీఐ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని సమాచారం...

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) సంస్థలో ఎంఎస్ ధోనీకి వాటా ఉంది. అందుకే సఫారీ టీ20 లీగ్‌లో ఆడకపోయినా సీఎస్‌కే ఫ్రాంఛైజీకి మెంటర్‌గా వ్యవహరించబోతున్నాడని సమాచారం...

Image credit: Getty

సీఎస్‌కే ఫ్రాంఛైజీకి చెందిన జట్టుకి ‘జోహన్‌బర్గ్ సూపర్ కింగ్స్’ అనే పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌ వంటి ఫ్రాంఛైజీల యజమానులే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జట్లను కొనుగోలు చేశారు.. 

Image credit: PTI

ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్ కోసం 30 మంది అంతర్జాతీయ ప్లేయర్లు కాంట్రాక్ట్ మీద సంతకాలు చేసేశారు. ఈ లీగ్‌లో పాల్గొనడానికి ఆస్ట్రేలియాతో ఆడాల్సిన సిరీస్‌ని కూడా రద్దు చేసుకోవడానికి సిద్ధమైంది సౌతాఫ్రికా...

click me!