ఆసియా కప్‌లో బాగా ఆడితేనే, టీ20 వరల్డ్ కప్‌ ఆడే ఛాన్స్... విరాట్ కోహ్లీతో పాటు వీరికి కూడా...

First Published Aug 11, 2022, 12:07 PM IST

టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆసియా కప్ బరిలో దిగుతోంది. ఇప్పటికే ఏడు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు, గత సీజన్‌లో టైటిల్ అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఈసారి కూడా టోర్నీ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరుగుతున్న ఆసియా కప్.. విరాట్ కోహ్లీకి కీలకంగా మారింది...

2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ పెద్దగా క్రికెట్ ఆడింది లేదు. ఆడిన మ్యాచుల్లోనూ పెద్దగా పర్పామెన్స్ ఇచ్చింది లేదు. దీంతో టీ20 టీమ్‌లో విరాట్ కోహ్లీ ప్లేస్ గురించి చాలా పెద్ద చర్చే జరుగుతోంది...

Image credit: Getty

ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీని కొనసాగించడం కంటే ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాని ఆడిస్తే బెటర్ అంటూ భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన కామెంట్లు, తీవ్ర దుమారం రేపాయి... దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీకి ప్లేస్ ఉండాలంటే ఆసియా కప్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే. 

ఆసియా కప్ 2022 టోర్నీలో కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైతే, టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో విరాట్ కోహ్లీ రిజర్వు బెంచ్‌కే పరిమితమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు... మిగిలిన ప్లేయర్లను తప్పించినంటే విరాట్ కోహ్లీని పక్కనబెట్టడానికి గాయం వంకను వాడొచ్చు...

Image credit: PTI

స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా‌తో పాటు హర్షల్ పటేల్ కూడా గాయపడడంతో 10 మ్యాచులు కూడా అనుభవం లేని ఆవేశ్ ఖాన్‌కి ఆసియా కప్ 2022 టోర్నీలో అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 3 ఓవర్లలోనే 47 పరుగులిచ్చిన ఆవేశ్ ఖాన్, ఆ తర్వాతి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి అదరగొట్టాడు...

Image credit: PTI

ఐపీఎల్‌లో నిలకడగా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్న ఆవేశ్ ఖాన్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే జట్టులో చోటు దక్కాలంటే మాత్రం ఆసియా కప్ 2022లో అదిరిపోయే స్పెల్స్‌తో మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ ఇచ్చే పర్పామెన్స్, అతని కెరీర్‌ని డిసైడ్ చేయనుంది...

Image credit: Getty

కుల్దీప్ యాదవ్‌ని కాదని యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌కి ఆసియా కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో చోటు కల్పించింది బీసీసీఐ. 9 టీ20 మ్యాచులు ఆడిన రవి భిష్ణోయ్, 15 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఏకంగా 4 వికెట్లు తీసిన భిష్ణోయ్... ఆసియా కప్‌లో అదరగొడితే, టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని కొట్టేయొచ్చు...

Image credit: PTI

టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు దినేశ్ కార్తీక్. అయితే ఈ సీనియర్ వికెట్ కీపర్‌‌కి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు ఉండాలంటే ఆసియా కప్‌లో తన సత్తా చాటాల్సి ఉంటుంది...

Sanju Samson vs Dinesh Karthik

ఇప్పటికే కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడంతో దినేశ్ కార్తీక్‌కి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. అయితే ఆసియా కప్‌లో ఒకటి లేదా రెండు మ్యాచుల్లో డీకేని వాడొచ్చు టీమిండియా. ఆ మ్యాచుల్లో కార్తీక్ ఇచ్చే పర్పామెన్స్, టీ20 వరల్డ్ కప్‌ ఆడే జట్టులో అతని ప్లేస్‌ని డిసైడ్ చేయనుంది...  దినేశ్ కార్తీక్ ఫెయిల్ అయితే టీ20 వరల్డ్ కప్ 2022లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ల వైపు చూడొచ్చు బీసీసీఐ...

click me!