ఐపీఎల్ ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకున్న ప్లేయర్లు ఎందరో. హర్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా నుంచి వాషింగ్టన్ సుందర్, నటరాజన్ వంటి ప్లేయర్లు... ఐపీఎల్ నుంచి భారత జట్టులోకి వచ్చినవాళ్లే... అయితే ఐపీఎల్, టీమిండియాలోకి వెళ్లడానికి ఫ్లాట్‌ఫాం కాదంటున్నాడు లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్...
ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా రెండుసార్లు టైటిల్స్ గెలిచిన గౌతమ్ గంభీర్, 2022 సీజన్‌లో కొత్తగా రాబోతున్న లక్నో సూపర్ జెయింట్ ఫ్రాంఛైజీగా మెంటర్‌గా వ్యవహరించబోతున్నాడు...
28
కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించే లక్నో సూపర్ జెయింట్ జట్టు, మార్కస్ స్టోయినిస్, రవి భిష్ణోయ్‌లను డ్రాఫ్ట్‌లుగా వేలానికి ముందే కొనుగోలు చేసింది...
38
‘నేను కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా ప్లేయర్లకు ఓ విషయాన్ని చెబుతుండేవాడిని. ఐపీఎల్‌లో బాగా ఆడితే, టీమిండియాకి ఆడవచ్చనే ఆలోచన పెట్టుకోకూడదని చెప్పేవాడిని...
48
ఎందుకంటే ఆటగాళ్లు కేవలం ఫ్రాంఛైజీ గురించి మాత్రమే ఆడాలి. ఐపీఎల్‌లో తాను ఆడే జట్టుకి విజయాలు ఎలా అందించాలి? నూటికి నూరు శాతం పర్ఫామెన్స్ ఎలా ఇవ్వాలనేదానిపైనే ఫోకస్ పెట్టాలి...
58
ఐపీఎల్, ఎప్పుడూ టీమిండియాలోకి వెళ్లడానికి ఫ్లాట్‌ఫాం కాదు. ఐపీఎల్ వల్ల టీమిండియా నుంచి పిలుపు వస్తే, అది కేవలం బై ప్రొడక్ట్ మాత్రమే...
68
టీమిండియాకి ఆడడమే అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటే, ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీకి ఆడడాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. అందుకే ఇక్కడ ఆడుతున్న మూడు నెలల కాలం పూర్తిగా క్రికెట్‌ను ఎంజాయ్ చేయాలి...
78
అంకితభావం, కష్టపడేతత్వం ఉన్న ప్రతీ ప్లేయర్‌కి ఐపీఎల్ ఓ చక్కని ఫ్లాట్‌ఫాం. మీ సత్తాని ప్రపంచానికి పరిచయం చేయడానికి చక్కని వేదిక... అదే మైండ్‌లో పెట్టుకోండి...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...
88
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లను ప్రోత్సహించాడు...