అందరూ బాగా ఆడుతున్నారు! ఇంతకంటే ఏమీ చెప్పలేను.. టీమిండియా ప్రదర్శనపై ధోనీ కామెంట్స్..

First Published | Oct 27, 2023, 7:44 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, టాప్‌లో నిలిచింది భారత జట్టు. మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండింట్లో గెలిచినా టీమిండియా సెమీస్ చేరుతుంది...
 

2011 వన్డే వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టైటల్ గెలిచిన భారత జట్టు, 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచ కప్ ఆడుతోంది..

Rohit Sharma -Virat Kohli

‘భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. చాలా చక్కని బ్యాలెన్సింగ్ కనిపిస్తోంది. అందరూ బాగా ఆడుతున్నారు. అంతా బాగా కనిపిస్తోంది. ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను.. మిగిలినవన్నీ సిగ్నల్‌తో అర్థం చేసుకోండి..’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ..


ఈసారి భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని ధోనీ కూడా ధీమాగా ఉన్నాడు. అయితే ఇంతకుముందు 2021, 2022 టీ20 వరల్డ్ కప్స్‌లో ధోనీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే భారత జట్టు టైటిల్ గెలవలేకపోవడంతో ఈసారి కామెంట్లు చేయకూడదని డిసైడ్ అయ్యాడు మాహీ..

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. రనౌట్‌తో అంతర్జాతీయ కెరీర్‌ని మొదలెట్టిన మాహీ, ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ రనౌట్ అయ్యాడు..

‘విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఓడిపోతే, ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. సెమీ ఫైనల్‌లో ఓడిపోతే అస్సలు తట్టుకోలేం. ప్రతీ మ్యాచ్‌కి నా ప్లాన్స్‌ని సిద్ధంగా పెట్టుకుంటాను. నేను ఇండియాకి ఆడిన ఆఖరి మ్యాచ్ అదే..

ఆ తర్వాత సంవత్సరానికి రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్ చేసినా, సెమీ ఫైనల్‌లో ఓడినప్పుడే అదే నా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అని నాకు తెలుసు.. ’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ..

Latest Videos

click me!