మామూలు మ్యాచుల్లో ఎవ్వడైనా ఆడతాడు! ఆ మ్యాచుల్లో ఆడడమే విరాట్ కోహ్లీ స్పెషల్... - మార్కస్ స్టోయినిస్

Published : Aug 26, 2023, 02:56 PM IST

సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ ప్రపంచాన్ని ఆ రేంజ్‌లో ప్రభావితం చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. 25 వేలకు పైగా పరుగులు, 76 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు...  

PREV
18
మామూలు మ్యాచుల్లో ఎవ్వడైనా ఆడతాడు! ఆ మ్యాచుల్లో ఆడడమే విరాట్ కోహ్లీ స్పెషల్... - మార్కస్ స్టోయినిస్

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది టీమిండియా. ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగిన గత నాలుగు మ్యాచుల్లోనూ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.. 2021 టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అట్టర్ ఫ్లాప్ అయినా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి టీమిండియాకి మంచి స్కోరు అందించాడు..

28
Virat Kohli, Marcus Stoinis

ఆసియా కప్ 2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో 35 పరుగులు చేసి టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, సూపర్ 4 మ్యాచ్‌లో 44 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అయితే మిగిలిన బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది..

38

‘మామూలు మ్యాచుల్లో ఎవ్వడైనా ఆడతాడు. ఎందుకంటే అక్కడ ఎలాంటి ప్రెషర్ ఉండదు. కానీ భారీ వేదికపై, పెద్ద టోర్నీల్లో ఆడాలంటే మాత్రం ప్రత్యేకమైన స్కిల్స్ ఉండాలి. అలాంటప్పుడే విరాట్ కోహ్లీ తనను తాను మరింత మెరుగ్గా గ్రేడ్ చేసుకుంటాడు..
 

48

మీరు జాగ్రత్తగా గమనిస్తే విరాట్ కోహ్లీ, సాధారణ మ్యాచుల్లో కంటే కీలక టోర్నీల్లోనే ఎక్కువ వేగంగా ఆడతాడు. బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తాడు. టీమ్‌లో ఎవరు ఒకరు ముందుకు వచ్చి ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు, విరాట్ కోహ్లీ ఆ బాధ్యత తన భుజాలపైకి వేసుకుంటాడు..
 

58

ఒక్కసారి విరాట్ కోహ్లీ టచ్‌లోకి వస్తే, అతన్ని ఆపడం చాలా కష్టం. మాలో చాలామంది వరల్డ్ కప్ లాంటి భారీ టోర్నీల్లో విరాట్ కోహ్లీలా ఆడాలని అనుకుంటాం. వరల్డ్ కప్‌లో బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం. కానీ అది అన్ని వేళలా సాధ్యం కాదు. కానీ విరాట్ విషయంలో అలా కాదు..

68
Marcus Stoinis

ఎందుకంటే అతని స్పెషల్ క్వాలిటీ ప్లేయర్. అతను ఇప్పటిదాకా ఆడిన ప్రతీ ఐసీసీ టోర్నీ మ్యాచ్, చాలామంది యంగ్‌స్టర్స్‌కి డిక్షనరీలాంటిది. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా...

78
Image credit: PTI

ఐపీఎల్‌లో నేను 9వ సీజన్ ఆడబోతున్నా. డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, జోష్ హజల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్, ఇప్పుడు కామెరూన్ గ్రీన్.. ఇలా చాలామంది ఐపీఎల్ ఆడుతున్నారు. ఐపీఎల్ వల్ల ఇండియన్ పిచ్‌ల గురించి తెలుసుకునే అవకాశం దొరికింది..

88
Image credit: PTI

ఏ పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని గ్రహించాం. అంతేకాదు ఏ మైదానం ఎంత విస్తీర్ణం ఉంటుంది. బౌండరీ డైమన్షన్స్ ఎలా ఉంటాయి. ఎలాంటి షాట్స్ ఆడితే పరుగులు రాబట్టవచ్చనే విషయాలను ఐపీఎల్ ద్వారా తెలుసుకున్నాం. వరల్డ్ కప్‌లో ఆ అనుభవం కచ్ఛితంగా ఉపయోగపడుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్నస్ స్టోయినిస్.. 
 

Read more Photos on
click me!

Recommended Stories