ఇండియాలో అందరినీ స్లెడ్జింగ్ చేసేవాళ్లం.. కానీ అతడిని మాత్రం.. : పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

First Published Jan 25, 2023, 2:15 PM IST

ఇండియాతో మ్యాచ్ అంటే  పాకిస్తాన్ క్రికెటర్లకు  స్లెడ్జింగ్ చేయమని బోర్డు నుంచి ఆదేశాలు అందేవట. ప్రత్యేకించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీకి టీమ్ మేనేజ్మెంట్ నుంచి  ప్రత్యేకమైన ఆదేశాలు కూడా వచ్చేవట. అయితే  ఇండియాలో ఆటగాళ్లందరినీ  స్లెడ్జింగ్ ేచేసినా  హైదరాబాద్ మాజీ క్రికెటర్ ను మాత్రం ఏమనకపోయేదట.. 

భారత్ - పాకిస్తాన్ మధ్య క్రికెట్ వైరం ఈనాటిది కాదు. తరాలు మారుతున్న కొద్దీ అది కొత్త రూపాలు సంతరించుకుంటున్నదే తప్ప ఏమాత్రమూ తగ్గడం లేదు.  అయితే ఇప్పుడంత లేకున్నా ఇరు దేశాలు ఆడేప్పుడు గతంలో  ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలు జరిగిన సందర్భాలు కోకొల్లలు.  

ఇండియన్ క్రికెటర్లను స్లెడ్జింగ్ చేస్తూ పాకిస్తాన్ క్రికెటర్లలో పలువురు నోటి దురుసు ప్రదర్శించేవారు. ఇండియాతో మ్యాచ్ అంటే  పాకిస్తాన్ క్రికెటర్లకు  స్లెడ్జింగ్ చేయమని బోర్డు నుంచి   కూడా ఆదేశాలు అందేవట. ప్రత్యేకించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీకి టీమ్ మేనేజ్మెంట్ నుంచి  ప్రత్యేకమైన ఆదేశాలు కూడా అందేవట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. 

తన యూట్యూబ్ ఛానెల్ లో బాసిత్ మాట్లాడుతూ.. ‘ఇండియాతో  మ్యాచ్ కు ముందు  టీమ్ మేనేజ్మెంట్ నాకు కీలక బాధ్యత అప్పజెప్పేది. ఇండియన్ ప్లేయర్లను స్లెడ్జింగ్ చేయడం నా పని.  సచిన్ టెండూల్కర్, అజయ్ జడేజా,  నవజ్యోత్ సింగ్ సిద్ధూ, వినోద్ కాంబ్లీలను  డిస్ట్రబ్ చేయమని నాకు చెప్పేవారు.  

అయితే  టీమిండియా ఆటగాళ్లను ఎంత స్లెడ్జింగ్ చేసినా మేం ఎప్పుడూ  మహ్మద్ అజారుద్దీన్ ను మాత్రం పల్లెత్తు మాట అనకపోయేవాళ్లం.  అజార్ భాయ్ బ్యాటింగ్ కు రాగానే నాతో పాటు పాక్ టీమ్ లో అందరూ  ఆయనను  పల్లెత్తు మాట కూడా అనకపోయేది. ఆయనంటే మాకు చాలా గౌరవం ఉండేది. మా డ్రెస్సింగ్ రూమ్ లో కూడా  అజార్ భాయ్ అంటే  చాలా గౌరవం. 

అది వసీం భాయ్ (వసీం అక్రమ్), సలీమ్ మాలిక్, రషీద్ లతీఫ్, ఇంజమామ్.. ఎవరైనా సరే  అజార్ ను స్లెడ్జ్ చేయడానికి యత్నించలేదు. మేం అంత డేర్ కూడా ఎప్పుడూ చేయలేదు. మేమే కాదు.. నాకు తెలిసి ఒక్క పాకిస్తాన్ ప్లేయర్ కూడా అజారుద్దీన్ ను స్లెడ్జ్ చేసి ఉండడు. 

ఆయన పట్ల మాకు అంత గౌరవం ఉండేది.  అజారుద్దీన్.. మొదట్లో 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు.  కానీ గంగూలీ, ద్రావిడ్ ల రాకతో అతడు తన బ్యాటింగ్ స్థానాన్ని కూడా మార్చుకున్నాడు. యువకుల కోసం ఆలోచించి అలా చేశాడు...’ అని వ్యాఖ్యానించాడు. 

పాకిస్తాన్ తరఫున  19 టెస్టులు,  50 వన్డేలు ఆడిన బాసిత్.. టెస్టులలో  858, వన్డేలలో  1,265 పరుగులు సాధించాడు.   రెండు ఫార్మాట్లలోనూ  ఒక సెంచరీ  చేశాడు. 2016లో  పాకిస్తాన్ నేషనల్ క్రికెట్ టీమ్ కు హెడ్ కోచ్ గా కూడా పనిచేశాడు.

click me!