టెస్టు కెప్టెన్‌గా చేయడానికి నేను కూడా రెఢీ... టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ వ్యాఖ్యలు...

First Published Jan 28, 2022, 10:49 AM IST

విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ రిటైర్మెంట్ తర్వాత ఆ పొజిసన్‌ను తీసుకొబోయే తర్వాతి కెప్టెన్ ఎవరు? అనే దానిపై సస్పెన్స్ వీడడం లేదు. రోహిత్ శర్మ దగ్గర్నుంచి కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, అశ్విన్, బుమ్రా... ఈ లిస్టు రోజురోజుకీ పెరుగుతూనే ఉంది... 

సౌతాఫ్రికా టూర్‌కి ముందు టెస్టుల్లో వైస్ కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో అతనికే టెస్టు పగ్గాలు కూడా ఇస్తే బెటర్ అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్సీ తీసుకోడానికి ఇష్టపడకపోతే యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కి టెస్టు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సునీల్ గవాస్కర్, యువీ వంటి మాజీలు అభిప్రాయపడ్డారు...

ఆల్‌రౌండర్‌గా అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో అదరగొడుతున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టు పగ్గాలు ఇస్తే బాగుంటుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు...

సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాకి టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతలు ఇస్తే బాగుంటుందని, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ ప్యాట్ కమ్మిన్స్ తీసుకున్నట్టు ఇక్కడ కూడా ఓ పేస్ బౌలర్‌కి ఇస్తే బెటర్ అన్నాడు హర్భజన్ సింగ్...

తాజాగా ఈ లిస్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా వచ్చి చేరాడు... ‘ఇప్పుడైతే నేను కెప్టెన్సీ గురించి పెద్దగా ఆలోచించడం లేదు... 

అయితే నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నిజం చెప్పాలంటే భారత జట్టును నడిపించాలని ఎవరికి మాత్రం ఉండదు...

ఒకవేళ కెప్టెన్సీ పగ్గాలు ఇస్తే మాత్రం భారత జట్టును విజయపథంలో నడిపించడానికి నూటికి నూరు శాతం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ షమీ...

57 టెస్టులు ఆడిన మహ్మద్ షమీ, 209 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 148, టీ20ల్లో 18 వికెట్లు తీసిన మహ్మద్ షమీకి సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్ నుంచి వెస్టిండీస్ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...

click me!