షోయబ్ అక్తర్, ఆ రోజు నన్ను బ్యాట్‌తో కొట్టాడు, ఇంకా అలాగే బతుకుతున్నాడు... మహ్మద్ ఆసిఫ్ కామెంట్స్...

First Published May 22, 2021, 4:00 PM IST

షోయబ్ అక్తర్... తన బౌలింగ్‌తో ఎంత పేరు తెచ్చుకున్నాడో, తన దురుసు ప్రవర్తనతో వివాదాల్లో ఇరుక్కుంటూ అంతకంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. తాజాగా మరోసారి పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్, షోయబ్ అక్తర్‌పై ‘కలల్లో బతకడం మానేయాలంటూ’ కామెంట్లు చేశాడు. ఆసిఫ్ కామెంట్ల వెనక చాలా పెద్ద కథే ఉంది.

2007 టీ20 వరల్డ్‌కప్ సమయంలో పాక్ పేసర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ అసిఫ్ మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. పాక్ ఆల్‌రౌండర్ షాహిద ఆఫ్రిదీ, మహ్మద్ అసిఫ్ డ్రెస్సింగ్‌రూమ్‌లో నవ్వుకుంటూ ఏదో విషయం మీద మాట్లాడుకుంటున్న సమయంలో అక్తర్ అక్కడికి వచ్చాడు.
undefined
వాళ్లిద్దరూ తన గురించే మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారని భావించిన అక్తర్, ఏం మాట్లాడుకుంటున్నారని నిలదీశారు. దానికి వాళ్లు సమాధానం చెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగాడు. ముందే బాగా షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండే అక్తర్, పక్కనే ఉన్న బ్యాటుతో ఆసిఫ్‌ను బలంగా కొట్టాడు.
undefined
ఈ సంఘటన కారణంగా ఆసిఫ్ తొడకు గాయం కూడా జరిగింది. ఈ సంఘటన బయటికి రావడంతో తీవ్ర దుమారం లేచింది. టీ20 వరల్డ్‌కప్ జట్టు నుంచి షోయబ్ అక్తర్‌ను తొలగిస్తూ పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది...
undefined
ఈ సంఘటన తర్వాత షోయబ్ అక్తర్, ఆసిఫ్‌కు క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి అక్కడ కామా పడింది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు మాత్రం ఇంకా తొలిగిపోలేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరు నోరుపారేసుకుంటూనే ఉన్నారు.
undefined
‘షోయబ్ అక్తర్, వాస్తవంలో కంటే కలల్లో ఎక్కువగా బతుకతాడు. ఎవరు ఏం మాట్లాడుకున్నా, తన గురించే అని ఫీల్ అవుతూ ఉంటాడు. అతనికి నాకు మధ్య గొడవ జరిగి 14 ఏళ్లు అవుతోంది. టైం దొరికినప్పుడల్లా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
undefined
తనకి తాను సెలక్టర్‌ను అవుతానని, పాక్ క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్‌గా మారబోతున్నానని... అంతేకాదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్ అవుతానని కూడా షోయబ్ అక్తర్ కలలు కంటున్నాడు. ఇలా టైం వేస్ట్ చేయకుండా యువ క్రికెటర్లకు సాయం చేస్తే బెటర్’ అంటూ కామెంట్ చేశాడు ఆసిఫ్.
undefined
click me!