IPL2021: రోహత్ శర్మ హాఫ్ సెంచరీ, అయినా ముంబై ఇండియన్స్ అదే జిడ్డాట...

First Published Apr 23, 2021, 9:19 PM IST

ఐపీఎల్‌లో చెన్నై చెపాక్ స్టేడియం ముంబై ఇండియన్స్‌ను ముప్పుతిప్పలు పెడుతూనే ఉంది. స్పిన్‌కి అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో భారీ స్కోరు చేయలేకపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై...

టాస్ గెలిచి ముంబై ఇండియన్స్‌కి బ్యాటింగ్ అప్పగించిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్, మొదటి ఓవర్‌ నుంచి అద్భుతమైన బౌలింగ్ మార్పులతో ప్రత్యర్థి జట్టును ఇబ్బందిపెట్టాడు. హెండ్రిక్ వేసిన తొలి ఓవర్‌లో రోహిత్ శర్మను అంపైర్ అవుట్‌గా ప్రకటించినా, రివ్యూ తీసుకున్న హిట్ మ్యాన్ బతికిపోయాడు.
undefined
రెండో ఓవర్ వేసిన దీపక్ హుడా... డి కాక్ వికెట్ తీశాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా విఫలమవుతున్న డి కాక్, 5 బంతుల్లో 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
undefined
పవర్ ప్లే ముగిసిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదటి ఓవర్ వేసిన యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఇషాన్ కిషన్‌ను అవుట్ చేశాడు. 17 బంతులు ఆడి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన ఇషాన్ కిషన్ 6 పరుగులకి రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
హెడ్రిక్, దీపక్ హుడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం... గత మ్యాచుల్లో విఫలమైన ఇషాన్ కిషన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లే ముగిసేసరికి కేవలం 21 పరుగులు మాత్రమే చేసింది ముంబై ఇండియన్స్. ఐపీఎల్‌లో ముంబైకి ఇది రెండో అత్యల్ప స్కోరు...
undefined
26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
27 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో క్రిస్‌గేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
ఆ తర్వాత 52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఫ్యాబియన్ ఆలెన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
undefined
4 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేసిన హార్ధిక్ పాండ్యా... అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా... 3 బంతుల్లో 3 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
12 బంతుల్లో 16 పరుగులు చేసిన పోలార్డ్ నాటౌట్‌గా నిలవగా షమీ 2, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశారు. దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్‌లకు చెరో వికెట్ దక్కింది.
undefined
click me!