అవుటైన తర్వాత అలా మెట్లపై కూర్చోడానికి కారణం ఇదే... కేకేఆర్ హిట్టర్ ఆండ్రే రస్సెల్...

First Published Apr 23, 2021, 8:45 PM IST

ఐపీఎల్ అంటే కేవలం క్యాష్ క్రికెట్ లీగ్ అనుకుంటారు చాలామంది. అయితే ఐపీఎల్‌లో విజయం కోసం ఆఖరి బంతిదాకా ప్రాణం పెట్టే ఆటగాళ్లు, విజయం దక్కనప్పుడు ఎమోషన్‌ అయ్యేవాళ్లు చాలామందే ఉంటారు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఇలాగే భావోద్వేగానికి గురయ్యాడు విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్...

సీఎస్‌కే జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహార్ సూపర్ స్పెల్ కారణంగా 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఇక కోల్‌కత్తా కథ ముగిసినట్టే అనుకున్నారంతా..
undefined
అయితే 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 54 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్... ఉన్నంతసేపు చెన్నై సూపర్ కింగ్స్‌ గుండెల్లో గుబులు పుట్టించారు. బంతి వచ్చేదే ఆలస్యంగా బౌండరీకి తరలిస్తున్న రస్సెల్‌ను ఎలా అవుట్ చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు సీఎస్‌కే బౌలర్లు...
undefined
సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో వైడ్ బాల్‌గా భావించి వదిలేసిన బంతి, వికెట్లను గిరాటేయడంతో అవుటైన ఆండ్రే రస్సెల్... డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లకుండా బ్యాటు, ప్యాడ్లు, హెల్మెట్‌తో మెట్లపై నిరాశగా కూర్చోవడం కెమెరాలో స్పష్టంగా కనిపించింది...
undefined
‘నేను చాలా బాగా ఆడుతున్న సమయంలో అలా అవుట్ అవ్వడంతో బాగా ఎమోషనల్ అయ్యాను. బంతిని వదిలేసి, బౌల్డ్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి... నా టీమ్‌మేట్స్‌కి ముఖం ఎలా చూపించాలో తెలియలేదు...
undefined
నేను జట్టు విజయానికి కావాల్సిన పరుగులు చేయాలనే ఆలోచనతోనే బ్యాటింగ్‌కి వెళ్లా... నేను ఆడిన విధానం కూడా బాగుంది. అయితే జట్టు కోలుకుంటున్న సమయంలో నేను అలా అవుట్ అవ్వడంతో తట్టుకోలేకపోయా...
undefined
ఒక్కసారిగా నాపై నాకే కోపం వచ్చింది. నాలోని హల్క్ బయటికి వచ్చాడు. ఈ రిజల్ట్ నాకు నచ్చలేదు. కానీ మేం ఆఖరిదాకా పోరాడాం... అనే సంతృప్తి మిగిలింది’ అంటూ చెప్పుకొచ్చాడు ఆండ్రే రస్సెల్...
undefined
‘ఆండ్రే రస్సెల్ అలా మెట్లపై కూర్చున్నప్పుడు అతని ముఖం చూడడానికి, వెళ్లి పరామర్శించడానికి కూడా నాకు ధైర్యం చాల్లేదు... టాపార్డర్‌లో మేం కొన్ని పరుగులైనా చేసి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం... ’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్..
undefined
‘మేం గెలవకపోవడం చాలా బాధేసింది. అయితే బ్యాటుతో రాణించిన నేను, ఒక్క ఓవర్ కరెక్టుగా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేది... ఈ ఓటమి గుర్తుండిపోతుంది’ అంటూ కామెంట్ చేశాడు ప్యాట్ కమ్మిన్స్...
undefined
31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కేకేఆర్... ఆండ్రే రస్సెల్‌తో దినేశ్ కార్తీక్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు, ప్యాట్ కమ్మిన్స్ 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేయడంతో 202 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
undefined
click me!