MI Cape Town: ఐదుగురు క్రికెటర్లను పరిచయం చేసిన కేప్‌టౌన్.. సాలిడ్ గ్రూప్‌ను తయారుచేస్తోందిగా...!

First Published Aug 11, 2022, 4:16 PM IST

MI Cape Town: ముంబై ఇండియన్స్ సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లో అడుగుపెట్టనున్నది. అక్కడ కేప్‌టౌన్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. తాజాగా ఆ జట్టు ఐదుగురు క్రికెటర్లను పరిచయం చేసింది. 

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా కీర్తిగాంచిన  ముంబై ఇండియన్స్ క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్ (సీఎస్ఎ టీ20) లో కేప్‌టౌన్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ జట్టు బుధవారం ఫ్రాంచైజీ పేరును విడుదల చేసింది. ఎంఐ కేప్‌టౌన్ అని దానికి పేరు పెట్టింది. 

తాజాగా ఎంఐ కేప్‌టౌన్.. తమ జట్టు తరఫున ఆడనున్న ఐదుగురు ఆటగాళ్ల పేర్లను కూడా రివీల్ చేసింది. ఇందులో ఇద్దరు సౌతాఫ్రికన్లు కాగా ఇద్దరు ఇంగ్లాండ్ క్రికెటర్లు. ఒకరు ఆఫ్ఘాన్ క్రికెటర్. 

దక్షిణాఫ్రికా నుంచి డెవాల్డ్ బ్రెవిస్ (అన్ క్యాప్డ్), కగిసొ రబాడాలను తీసుకుంది. బ్రెవిస్ ఇప్పటికే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.  జూనియర్ ఏబీ డివిలియర్స్ గా గుర్తింపుపొందిన అతడు.. సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ లో సైతం ఎంఐ తరఫునే ఆడనున్నాడు. 

ఇంగ్లాండ్ ఆటగాళ్లు లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్ లు కేప్‌టౌన్ తరఫున ఆడనున్నారు. ఈ ఇద్దరూ ఆల్ రౌండర్లే కావడం విశేషం. ఇక మరో ఆటగాడిగా  టీ20 స్పెషలిస్టు రషీద్ ఖాన్ ను తీసుకుంది. 

ఎంపిక చేసిన ఐదుగురు ఆటగాళ్లలో బ్రెవిస్ ఓపెనింగ్ బ్యాటర్.  టీ20లకు అతడి ఆట పర్ఫెక్ట్ గా సూటవుతుంది.  లివింగ్ స్టోన్ మెరుపులేంటో ఐపీఎల్ అభిమానులకు ఎరుకే. సామ్ కరన్ ఆల్ రౌండరే. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ  అతడు స్టోక్స్ వారసుడిగా గుర్తింపు పొందుతున్నాడు. 

స్పిన్నర్ గా రషీద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.  ఐపీఎల్ తో పాటు బీబీఎల్, పీఎస్ఎల్, బీపీఎల్ లో అతడి  తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుత క్రికెట్ లో అగ్రశ్రేణి బౌలర్ గా గుర్తింపు పొందుతున్న రబాడా జట్టుకు అదనపు బలం. 

Kagiso Rabada

ప్రస్తుతం ప్రకటించిన  ఐదుగురు ఆటగాళ్లను బట్టి చూస్తే ముంబై  మాదిరే  ఒక కోర్ గ్రూప్ ను తయారుచేయడానికి  కేప్‌టౌన్ కూడా సిద్ధమవుతున్నట్టు కనబడుతున్నది.  ప్రపంచ స్థాయి హిట్టర్లు,  స్పిన్నర్లు, ఆల్ రౌండర్లతో జట్టును నింపేసి దక్షిణాఫ్రికా గడ్డమీద ముంబై జెండా పాతాలని యాజమాన్యం భావిస్తున్నది.

click me!