మిగిలినవాళ్లంతా బాగానే ఆడుతున్నారు, అతని ఫామ్ ఒక్కటే... ఆకాశ్ చోప్రా కామెంట్...

First Published Aug 29, 2021, 11:47 AM IST

ఇంగ్లాండ్ టూర్‌లో భారత జట్టును మిడిల్ ఆర్డర్ వైఫల్యం తీవ్రంగా వెంటాడుతోంది. అయితే భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో మిగిలిన ప్లేయర్ల కంటే రిషబ్ పంత్ బ్యాటింగ్ వైఫల్యం, టీమిండియాను బాగా దెబ్బతీస్తుందని అంటున్నాడు క్రికెట్ విశ్లేషకుడు, మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

తొలి రెండు టెస్టుల్లో ఓపెనర్ కెఎల్ రాహుల్ ఆకట్టుకున్నా, మూడో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కెఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఆడినా కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు...

రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఆకట్టుకుంటుంటే... ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు చేసుకుని ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. పూజారా 91 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకోగా, విరాట్ కోహ్లీ 55 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...

‘రాహుల్ ఫామ్ టీమిండియాకి పెద్ద విషయం కాదు, ఎందుకంటే అతనికి ఇప్పటికే ఓ హాఫ్ సెంచరీ, సెంచరీ ఉన్నాయి... కాబట్టి అతను భారీ స్కోరు చేసి, కమ్‌బ్యాక్ ఇవ్వగలడు...

రోహిత్ శర్మ మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా కూడా మూడో టెస్టులో ఇన్నింగ్స్‌తో గాడిలో పడినట్టే కనిపించాడు...

అజింకా రహానే రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మినహా పెద్దగా పరుగులేమీ చేయకపోయినా... టీమిండియాకి అది పెద్దగా ప్రభావం చూపించదు....

అయితే రిషబ్ పంత్ వరుసగా విఫలం అవుతుండడం మాత్రం టీమిండియాకి పెద్ద సమస్యే. ఐదు బౌలర్లతో ఆడుతున్నప్పుడు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చే రిషబ్ పంత్ పరుగులు చేయడం అత్యంత అవసరం...

వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్‌లా ఆడలేడు. అతను పూర్తిగా టెస్టు బ్యాట్స్‌మెన్... అందుకే రిషబ్ పంత్‌నే కొనసాగించాల్సిన పరిస్థితి టీమిండియాది.... 

రిషబ్ పంత్‌ ఇలాగే కొనసాగితే, వచ్చే టెస్టుల్లో అతని కంటే ముందు రవీంద్ర జడేజాని బ్యాటింగ్‌కి పంపించాల్సి ఉంటుంది... రిషబ్ పంత్ కంటే జడ్డూ బ్యాటుతో రాణిస్తున్నాడు...’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా...

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసిన రిషబ్ పంత్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు...

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసిన రిషబ్ పంత్, మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచాడు...

click me!