హ్యాట్రిక్ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... మళ్లీ టాప్‌లోకి ఆర్‌సీబీ...

First Published Apr 18, 2021, 7:20 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి, టేబుల్ టాపర్‌గా నిలిచింది. 205 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ 38 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.

భారీ లక్ష్యచేధనను దూకుడుగా ప్రారంభించింది కేకేఆర్. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేసి జెమ్మీసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
undefined
అయితే వస్తూనే బౌండరీ బాదిన రాహుల్ త్రిపాఠి 20 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో త్రిపాఠి అవుట్ కావడంతో 57 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది కేకేఆర్.
undefined
11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 18 పరుగులు చేసిన నితీశ్ రాణా... యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 66 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది కోల్‌కత్తా...
undefined
దినేశ్ కార్తీక్ 5 బంతుల్లో 2 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్‌ను యజ్వేంద్ర చాహాల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇయాన్ మోర్గాన్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కాగా...
undefined
షకీబ్ అల్ హసన్ 25 బంతుల్లో 26 పరుగులు, ప్యాట్ కమ్మిన్స్ 6 పరుగులు చేయగా ఆండ్రే రస్సెల్... యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో ఓ సిక్స్, మూడు ఫోర్లతో 20 పరుగులు రాబట్టినా... ఆర్‌సీబీ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.
undefined
19వ ఓవర్ వేసిన సిరాజ్ కేవలం ఒకే పరుగు ఇవ్వడం, 20వ ఓవర్ మొదటి బంతికే హర్షల్ పటేల్ ఆండ్రే రస్సెల్‌ను అవుట్ చేయడంతో ఆర్‌సీబీ విజయం సొంతం చేసుకుంది...
undefined
ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించడం ఇదే తొలిసారి...
undefined
click me!