గిల్.. రికార్డులు ఢమాల్.. గుజరాత్ - ముంబై మ్యాచ్‌లో శుభ్‌మన్ ధాటికి బద్దైన రికార్డులివే..

First Published May 27, 2023, 3:55 PM IST

IPL 2023: ఐపీఎల్ - 16 లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. నిన్న ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో    సెంచరీతో చెలరేగిన విషయం తెలసిందే. తద్వారా అతడు  బ్రేక్ చేసిన రికార్డులివే.. 

టీమిండియా నయా సంచలనం శుభ్‌మన్ గిల్ దాటికి  ఐపీఎల్ లో రికార్డుల పుస్తకాలలో పేర్లు మారిపోయాయి.  ఐపీఎల్ లో మూడు సెంచరీలు చేసిన గిల్.. ఇప్పటికే ఈ సీజన్ లో  ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన  ఆటగాళ్ల జాబితాలో  కోహ్లీ (973), బట్లర్ (863)   తర్వాత గిల్ (851) మూడో  స్థానంలో నిలిచాడు.   ఈ క్రమంలో  గిల్.. వార్నర్ (848) రికార్డును బ్రేక్ చేశాడు. 

49 బంతుల్లో సెంచరీ చేసిన గిల్.. ఈ ఇన్నింగ్స్ లో  పది సిక్సర్లు బాదాడు.  గతంలో ఈ రికార్డు  రషీద్ ఖాన్  (10)  పేరిట ఉండేది. అయితే ఇది గుజరాత్  తరఫునే. ఈ జాబితాలో  క్రిస్ గేల్ (17 సిక్సర్లు)  అందరికంటే ముందున్నాడు. మెక్‌కల్లమ్ (13), క్రిస్ గేల్ (13), డివిలియర్స్ (12), రసెల్ (11), కీరన్ పొలార్డ్ (10) లు కూడా జాబితాలో ఉన్నారు. అయితే ప్లేఆఫ్స్  లో  మాత్రం అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత మాత్రం గిల్‌దే. ఈ జాబితాలో  గేల్, సాహా (8 సిక్సర్లు) తదుపరి స్థానాల్లో నిలిచారు. 

Image credit: PTI

ఒక సీజన్ లో  కోహ్లీ, బట్లర్ లు నాలుగేసి సెంచరీలు చేయగా ఆ తర్వాత మూడు సెంచరీలతో గిల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.  ఐపీఎల్ ప్లేఆఫ్స్  లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (129)  సాధించిన రికార్డు గిల్ పేరిటే నమోదైంది. అంతకుముందు ఇది వీరేంద్ర సెహ్వాగ్ (122) పేరిట ఉండేది.  

ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్లలో  గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో  కెఎల్ రాహుల్..  2020 లో పంజాబ్ కు ఆడుతూ ఆర్సీబీపై 132 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. గిల్.. రిషభ్ పంత్ (128), మురళీ విజయ్ (127) తో పాటు సెంచరీలు చేసిన మిగతా ఇండియన్ బ్యాటర్స్ రికార్డు బ్రేక్ చేశాడు. 

Image credit: PTI

ఈ లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు మాత్రం ఇప్పటికీ  క్రిస్ గేల్ పేరిటే ఉంది. గేల్.. పూణె వారియర్స్ పై 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ మ్యాచ్ లో  సెంచరీ చేసిన మరో దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్..  బ్రెండన్ 73 బంతుల్లో  158 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెఎల్ రాహుల్ (132) తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరు గిల్ (129) దే కావడం గమనార్హం.  

Image credit: PTI

ప్లేఆఫ్స్ లో సెంచరీ చేసిన ఏడో బ్యాటర్ గిల్. అంతేగాక అతి పిన్న వయసులోనే సెంచరీ చేసిన ఆటగాడు కూడా అతడే.  ఈ గుజరాత్ ఓపెనర్ వయసు 23 ఏండ్లే. 

click me!