KXIP vs RCB: కింగ్స్ వర్సెస్ ‘కింగ్’ కోహ్లీ... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

First Published Sep 24, 2020, 5:00 PM IST

IPL 2020: మూడు సార్లు ఫైనల్ చేరినా, ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. ‘కింగ్’ కోహ్లీ సారథ్యంలో ఏడేళ్లుగా ఒక్క టైటిల్ గెలవడానికి ఎడతెగని పోరాటం చేస్తోంది రాయల్ ఛాలెంజర్స్. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుది కూడా అంతకంటే ఘోరమైన పరిస్థితి. 13 సీజన్లలో ఒకేఒక్కసారి ఫైనల్ చేరిన బెంగళూరు, ఈసారి చరిత్ర తిరగరాయాలని కసిగా ఉంది. కింగ్స్ ఎలెవన్, ‘కింగ్’ కోహ్లీ టీమ్‌ మధ్య జరుగుతున్న నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

క్రిస్‌గేల్: మొదటి మ్యాచ్‌లో గేల్‌ను తప్పించి భారీ మూల్యం చెల్లించుకుంది పంజాబ్. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన పూరన్, రెండు సార్లు డకౌట్ అయ్యి చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. కాబట్టి నేటి మ్యాచ్‌లో ‘యూనివర్సల్ బాస్’ బరిలో దిగే అవకాశం ఉంది.
undefined
మ్యాక్స్‌వెల్: మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌పై భారీ ఆశలే పెట్టుకుంది పంజాబ్. మొదటి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా రెండో మ్యాచ్‌లోనూ మ్యాక్స‌వెల్‌కి అవకాశం దక్కొచ్చు.
undefined
కెఎల్ రాహుల్: టీ20 ఫార్మాట్‌లో రెచ్చిపోయే కెఎల్ రాహుల్, మొదటి మ్యాచ్‌లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రాహుల్ మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కాబట్టి నేటి మ్యాచ్‌లో ఈ యంగ్ కెప్టెన్ నుంచి స్పెషల్ ఇన్నింగ్స్ కచ్ఛితంగా ఆశించవచ్చు.
undefined
మయాంక్ అగర్వాల్: మొదటి మ్యాచ్‌లో విజయంపై దాదాపు ఆశలు వదులుకున్న సమయంలో అదరగొట్టే ఇన్నింగ్స్‌తో గేమ్ ఛేంజర్ అయ్యాడు మయాంక్. 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ గెలిపించినంత పని చేశాడు. నిజంగానే అంపైర్ పొరపాటు చేయకుంటే మయాంక్ పంజాబ్‌ను గెలిపించేవాడే.
undefined
విరాట్ కోహ్లీ: బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ వచ్చి చాలా రోజులైంది. కొన్నిరోజులుగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్, ఈ మ్యాచ్‌లో తిరిగి తన జోరు అందుకుంటే అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు.
undefined
ఏబీ డివిల్లియర్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై బెంగళూరు భారీ స్కోరు చేయడంలో మ్యాచ్ చివర్లో డివిల్లియర్స్ ఆడిన స్పెషల్ ఇన్నింగ్స్‌యే కారణం. ఈ మ్యాచ్‌లో కూడా డివిల్లియర్స్ తన ఫామ్ కొనసాగిస్తే పంజాబ్ బౌలర్లకు కష్టాలు తప్పవు.
undefined
దేవ్‌దత్ పడిక్కల్: మొదటిసారి బ్యాటింగ్ చేస్తున్న ఆ ఫీలింగ్ ఎక్కడా తెలియకుండా అద్భుతంగా ఆడాడు దేవ్‌దత్ పడిక్కల్. ఎంట్రీ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. పడిక్కల్ నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆశించొచ్చు.
undefined
షమీ: మొదటి మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీశాడు మహ్మద్ షమీ. 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విరాట్ కోహ్లీ వీక్ పాయింట్లు బాగా తెలిసిన షమీ, బెంగళూరుపై మ్యాచ్‌లో కీలకం కానున్నాడు.
undefined
చాహాల్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ బ్యాట్స్‌మెన్ స్పిన్ బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించగలరు. రాహుల్, మయాంక్, కరణ్ నాయర్, క్రిస్‌గేల్... ఇలాంటి బ్యాట్స్‌మెన్‌ను చాహాల్ తన మ్యాజిక్‌తో అడ్డుకోగలిగితే... మరోసారి గేమ్ ఛేంజర్ అయ్యినట్టే.
undefined
ఈ సీజన్‌లో జట్టులోకి వచ్చిన ఆరోన్ ఫించ్ మొదటి మ్యాచ్‌లో 29 పరుగులు మాత్రమే చేశాడు. ఓ వైపు దేవ్‌దత్ పడిక్కల్ దూకుడుగా బౌండరీలు బాదుతుంటే, ఫించ్ సింగిల్స్ తీస్తూ అతనికి స్టైయిక్ ఇచ్చాడు. నేటి మ్యాచ్‌లో ఫించ్ హిట్టింగ్ కూడా కీలకం కానుంది.
undefined
click me!