KKR vs MI: ‘హిట్ మ్యాన్’ రికార్డుల మోత... రోహిత్ శర్మ ఖాతాలో...

First Published Sep 23, 2020, 9:35 PM IST

IPL 2020: కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చెన్నైతో విఫలమైనా, కోల్‌కత్తాపై అదరగొట్టిన ‘హిట్ మ్యాన్’ పలు రికార్డులను బద్ధలు కొట్టాడు. 200+  సిక్సర్ల క్లబ్‌లో రోహిత్ శర్మ... ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గానూ రోహిత్ శర్మ రికార్డు...మరిన్ని రికార్డులు... 

6 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 200 సిక్సర్ల క్లబ్‌లో చేరాడు .
undefined
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో ప్లేస్‌లో ఉన్న రోహిత్ శర్మ,
undefined
ధోనీ తర్వాత ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ.
undefined
క్రిస్ గేల్ 326 సిక్సర్లతో టాప్‌లో ఉండగా, ఏబీ డివిల్లియర్స్ 214, ధోనీ 212 సిక్సర్లతో టాప్ 3లో ఉన్నారు.
undefined
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 900+ పరుగులు చేశాడు రోహిత్ శర్మ.
undefined
ఇంతకుముందు ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ కూడా కోల్‌కత్తాపైనే 829 పరుగులు చేశాడు.
undefined
ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ.
undefined
వార్నర్ 48, కోహ్లీ 41, రైనా 39 హాఫ్ సెంచరీలు చేయగా రోహిత్ శర్మ 38 హాఫ్ సెంచరీలు బాదాడు.
undefined
దుబాయ్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ప్లేయర్ రోహిత్ శర్మ..
undefined
ఇంతకుముందు అజింకా రహానే, సంజూ శాంసన్ మాత్రమే యూఏఈలో రెండు అర్ధశతకాలు నమోదుచేశారు.
undefined
click me!