KXIPvsMI: కెఎల్ రాహుల్ వర్సెస్ రోహిత్ శర్మ.. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

First Published Oct 1, 2020, 4:18 PM IST

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచుల్లోనూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఈ రెండు జట్లూ, సూపర్ ఓవర్ మ్యాచ్‌లు కూడా ఆడాయి. ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

కెఎల్ రాహుల్: ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు కెఎల్ రాహుల్. ఇప్పటికే ఓ అద్భుత శతకంతో పాటు ఓ హాఫ్ సెంచరీ కూడా చేసిన కెఎల్ రాహుల్, ముంబై బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
undefined
రోహిత్ శర్మ: రెండో మ్యాచ్‌లో 80 పరుగులతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ, మూడో మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అయితే నేటి మ్యాచ్‌లో రోహిత్ ఆడితే ముంబైకి విజయం దక్కడం పెద్ద కష్టమేమీ కాదు.
undefined
మయాంక్ అగర్వాల్: ఆరెంజ్ క్యాప్ కోసం కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో పోటీపడుతున్నాడు మయాంక్ అగర్వాల్. ఈ ఇద్దరికి కేవలం ఒక్క పరుగు మాత్రమే తేడా ఉంది. ప్రస్తుత సీజన్‌లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టిన మయాంక్, కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు.
undefined
ఇషాన్ కిషన్: గత మ్యాచ్‌లో మ్యాచ్ గెలిచిపించినంత పని చేశాడు యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్. ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న ఇషాన్ కిషన్, మరోసారి తనదైన స్టైల్‌లో చెలరేగిపోవచ్చు.
undefined
గ్లెన్ మ్యాక్స్‌వెల్: మ్యాక్స్‌వెల్ నుంచి ఇప్పటిదాకా తన రేంజ్ పర్ఫామెన్స్ అయితే రాలేదు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్న మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాల్సిందే.
undefined
కిరన్ పోలార్డ్: చాలారోజుల తర్వాత గత మ్యాచ్‌లో పోలార్డ్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ వచ్చింది. ఫామ్‌లోకి వచ్చి మ్యాచ్‌ను టై చేసిన పోలార్డ్... పంజాబ్‌పై ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇస్తే రాహుల్ జట్టుకి కష్టాలు తప్పవు.
undefined
క్రిస్‌గేల్: ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌ను ముఖ్యమైన మ్యాచ్‌ల కోసం అందుబాటులో ఉండేలా దాచిపెడుతోంది కింగ్స్ ఎలెవన్. ఇప్పటికే రెండు మ్యాచులు ఓడిపోవడంతో నేటి మ్యాచ్‌లో గేల్ బరిలో దిగే అవకాశం ఉండొచ్చు.
undefined
హార్ధిక్ పాండ్యా: మూడు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు హార్ధిక్ పాండ్యా. సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు పాండ్యా. హార్ధిక్ పాండ్యా ఫామ్‌లోకి త్వరగా రావాలని ముంబై ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
undefined
నికోలస్ పూరన్: ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందర్నీ ఫిదా చేసేశాడు నికోలస్ పూరన్. అయితే గేల్ బరిలో దిగితే, పూరన్‌కి తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు.
undefined
మహ్మద్ షమీ: ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు మహ్మద్ షమీ. పరుగులను నియంత్రించడంతో పాటు వికెట్లు కూడా తీస్తున్న షమీ, పంజాబ్ పేస్ విభాగానికి కీలకంగా మారాడు.
undefined
ట్రెంట్ బౌల్ట్: ఈ ఐసీసీ టాప్ బౌలర్ ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వడంలో విఫలమవుతున్నాడు. బౌల్ట్‌పై భారీగా అంచనాలు పెట్టుకున్న ముంబై, అతని నుంచి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ కోరుకుంటోంది.
undefined
రవి బిష్ణోయ్: ఈ అండర్ 19 సెన్సేషన్‌ను అద్భుతంగా వాడుకుంటుందో పంజాబ్ కింగ్స్ ఎలెవన్. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన బిష్ణోయ్, స్టార్ బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
undefined
జస్ప్రిత్ బుమ్రా: గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వేసిన బుమ్రా... 8 పరుగుల టార్గెట్‌ను ఆఖరి బంతి దాకా ఆపాడు. అయితే బుమ్రా రేంజ్ పర్ఫామెన్స్ మాత్రం ఇది కాదు. యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెట్టే బుమ్రా కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటోంది ముంబై.
undefined
మురుగన్ అశ్విన్: ఈ సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు మురుగన్ అశ్విన్. రవిచంద్రన్ అశ్విన్‌ను వేరే జట్టుకి ఇచ్చేసి మురుగన్ అశ్విన్‌ను అంటిపెట్టుకున్న పంజాబ్, అతన్ని కరెక్టుగా వాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది.
undefined
click me!