టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి నిలకడైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు దీపక్ హుడా. ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసిన దీపక్ హుడాకి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో చోటు ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది...
వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, తొలి టీ20 మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా దినేశ్ కార్తీక్ 19 బంతుల్లో 41 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు...
27
Image credit: PTI
అయితే వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. రిషబ్ పంత్ 14, హార్ధిక్ పాండ్యా 1, రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు...
37
‘ఈ మ్యాచ్‌లో దీపక్ హుడా ఎందుకు లేడు? టీ20ల్లో అతని పర్ఫామెన్స్ బాగుంది. వన్డేల్లోనూ బాగా ఆడాడు. బాగా ఆడుతున్నవారికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్‌మెంట్‌దే...
47
Deepak Hooda
టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండర్లు ఎక్కువ అవసరం. బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు, బౌలింగ్ ఆల్‌రౌండర్లు... టీమ్‌లో అందరూ ఆల్‌రౌండర్లే ఉంటే ఇంకా మంచిది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...
57
Deepak Hooda and Sanju Samson
‘రాహుల్ భాయ్ ఏమనుకుంటాడంటే ఓ ప్లేయర్ బాగా ఆడినప్పుడు అతనికి కొన్ని ఛాన్సులు ఇవ్వడం బెటర్. ఆ తర్వాత వేరే ప్లేయర్ల గురించి ఆలోచిస్తాడు...’ అంటూ శ్రీకాంత్‌కి సమాధానం చెప్పబోయాడు ప్రజ్ఞాన్ ఓజా...
67
Sanju Samson-Deepak Hooda
ఓజా పూర్తి చేయకముందే అతన్ని అడ్డుకున్న క్రిష్...‘రాహుల్ ద్రావిడ్ ఏమనుకుంటున్నాడో వదిలేయండి... మీరేం అనుకుంటున్నారు.. అది చెప్పండి చాలు...’ అంటూ వారించాడు...
77
దీంతో ప్రజ్ఞాన్ ఓజా... ‘హుడాకి అవకాశం ఇచ్చి ఉండాల్సింది... అతను టీమ్‌కి కావాలి...’ అంటూ నవ్వేశాడు. దీంతో శ్రీకాంత్... ‘అంతే.. అయిపోయింది’ అంటూ తేల్చేశాడు. ఫ్యాన్‌కోడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది...