ఆ ఇద్దరూ తప్ప, ఆసియా కప్ టీమ్‌నే వరల్డ్ కప్‌లో ఆడించబోతున్నారా.... సౌరవ్ గంగూలీ ఎంపిక చేసిన లిస్టులో...

Published : Aug 26, 2023, 10:44 AM IST

వరల్డ్ కప్ 2023 టోర్నీకి ప్రాక్టీస్‌గా ఆసియా కప్ 2023 టోర్నీ ఆడబోతోంది టీమిండియా. ఆగస్టు 30 నుంచి మొదలయ్యే ఆసియా కప్ 2023 టోర్నీ కోసం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ లిస్టులో ఇద్దరు తప్ప, మిగిలిన జట్టుతోనే టీమిండియా, వన్డే వరల్డ్ కప్ ఆడుతుందని అంటున్నాడు బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...

PREV
16
ఆ ఇద్దరూ తప్ప, ఆసియా కప్ టీమ్‌నే వరల్డ్ కప్‌లో ఆడించబోతున్నారా.... సౌరవ్ గంగూలీ ఎంపిక చేసిన లిస్టులో...

వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌గా శుబ్‌మన్ గిల్‌ని ఎంచుకున్న సౌరవ్ గంగూలీ... మరో ఓపెనర్‌గా వికెట్ కీపింగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కి అవకాశం ఇచ్చాడు. ఓపెనర్‌గా వన్డేల్లో ఇషాన్ కిషన్ రికార్డు చాలా బాగుంది..

26

వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేసిన దాదా, సూర్యకుమార్ యాదవ్‌ని అతనికి రిప్లేస్‌మెంట్‌గా ఎంచుకున్నాడు. 
 

36

గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇస్తున్న వికెట్ కీపర్ కెఎల్ రాహుల్‌కి విశ్రాంతినిచ్చిన మ్యాచుల్లో ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా, సూర్యకుమార్ యాదవ్‌‌ని ఐదో స్థానంలో ఆడించాలని సూచించాడు సౌరవ్ గంగూలీ...
 

46

ఆ తర్వాతి స్థానాల్లో హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను ఎంచుకున్నాడు సౌరవ్ గంగూలీ. హార్ధిక్, కుల్దీప్, బుమ్రా, షమీ, సిరాజ్ తుది జట్టులో ఉంటే, మిగిలిన ప్లేయర్లను రొటేషన్ పద్దతిలో వాడుకోవాలని తెలిపాడు గంగూలీ..

56

మొత్తంగా సౌరవ్ గంగూలీ, వన్డే వరల్డ్ కప్‌కి ప్రకటించిన జట్టు ఇలా ఉంది: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్..
 

66

ఆసియా కప్ 2023 టోర్నీకి టీమిండియా ప్రకటించిన జట్టులో తిలక్ వర్మ, ప్రసిద్ధ్ కృష్ణ మినహా... అదే టీమ్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడించాలని సూచించాడు సౌరవ్ గంగూలీ. ఇదే నిజమైతే యజ్వేంద్ర చాహాల్‌కి మరో షాక్ తగలక తప్పదు.. 

click me!

Recommended Stories