అవును! అందరూ వెళ్లే చోటుకే మేమూ వెళ్లాం... కెఎల్ రాహుల్ వీడియోపై అథియా శెట్టి రియాక్షన్...

First Published May 27, 2023, 9:54 PM IST

గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న కెఎల్ రాహుల్, ప్రస్తుతం లండన్‌లో కోలుకుంటున్నాడు. సర్జరీ కోసం అక్కడికి వెళ్లిన రాహుల్, అక్కడ ఓ అడల్ట్ క్లబ్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...
 

లండన్‌లో లక్స్ (Luxx) అనే ఓ స్ట్రిప్ క్లబ్‌‌లో ఓ లేడీ డ్యాన్సర్ డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు కెఎల్ రాహుల్. స్ట్రిప్ క్లబ్ అంటే లేడీ డ్యాన్సర్లు, పోల్ డ్యాన్స్ ఆడుతూ తమ ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసేస్తారు...

Image: KL Rahul, Athiya Shetty Instagram

ఇండియాలో ఇలాంటి క్లబ్‌లకు అనుమతి లేదు కానీ లండన్‌లో ఇవి చాలా నార్మల్... అయితే ఇలాంటి క్లబ్‌లో కెఎల్ రాహుల్ కనిపించడమే టీమిండియా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

Athiya Shetty

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండడంతో గాయానికి చికిత్స కోసమని వెళ్లి, ఇదేం పాడు పని అంటూ రాహుల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి.. దీంతో కెఎల్ రాహుల్ భార్య అథియా శెట్టి దీనిపై స్పందించింది..

Image: Getty

‘సాధారణంగా నేను ఏ విషయానికి పెద్దగా స్పందించను. అయితే కొన్నిసార్లు మనకోసం మనం నిలబడడం చాలా అవసరం. అవును నేను, రాహుల్, మా ఫ్రెండ్స్ కలిసి అందరూ వెళ్లే ఓ సాధారణ ప్లేస్‌కే వెళ్లాం. కాబట్టి లేనిదాన్ని ప్రచారం చేయకుండా, ఏదైనా తెలుసుకుని రిపోర్ట్ చేయండి..  Peace and Love’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది అథియా శెట్టి...

అయితే అథియా శెట్టి రియాక్షన్‌పై కూడా ట్రోల్స్ వస్తుండడం విశేషం. బాలీవుడ్ వెటరన్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అథియా శెట్టికి నైట్ పార్టీలు, క్లబ్‌లు కొత్తేమీ కాదు. అందుకే క్రికెటర్‌ కెఎల్ రాహుల్‌ని కూడా అలాగే తీసుకెళ్లి ఉంటుందని అంటున్నారు నెటిజన్లు.. 
 

హర్మ్‌స్ట్రింగ్ సర్జరీ కోసం భార్య అథియా శెట్టితో కలిసి లండన్ వెళ్లిన కెఎల్ రాహుల్, సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యిందంటూ ఫోటోలను కూడా షేర్ చేశాడు. నడవడానికి కూడా కష్టపడుతున్న రాహుల్, ఊతకర్రలు పట్టుకుని నడవడం చూసి ఫ్యాన్స్ బాధపడ్డారు కూడా..
 


వరుసగా విఫలమవుతున్నా మరోదారి లేక భారత జట్టులో కొనసాగుతూ వచ్చిన కెఎల్ రాహుల్, పేలవ ఫామ్‌తో టీ20ల్లో ప్లేస్ కోల్పోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టుల్లోనూ చోటు కోల్పోయాడు. శుబ్‌మన్ గిల్ త్రీఫార్మాట్ ప్లేయర్‌గా అవతరించడంతో టీమ్‌లో కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడం చాలా కష్టమైన విషయమే..
 

click me!