విరాట్ కోహ్లీ 973 రికార్డుకు చేరువలో శుబ్‌మన్ గిల్... ఫైనల్‌లో ఆ స్కోరు చేస్తే, ఒకే దెబ్బకు...

2023 ఏడాదిలో పీక్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు శుబ్‌మన్ గిల్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటికే ఐదు సెంచరీలు, అందులోనూ మూడు ఫార్మాట్లలో శతకాలు బాదిన శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ బాది అరుదైన ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు...

PTI PhotoKunal Patil) (PTI05_26_2023_000255B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో 3 సెంచరీలు బాదిన శుబ్‌మన్ గిల్, 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. నాలుగు సార్లు 50+ స్కోర్లు నమోదు చేసిన శుబ్‌మన్ గిల్, ఓ మ్యాచ్‌లో 90+ స్కోరు కూడా నమోదు చేసుకున్నాడు...

Image credit: PTI

ఐపీఎల్ 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ రికార్డు లెవెల్లో 973 పరుగులు చేశాడు. 7 సీజన్లుగా ఈ రికార్డును ఎవ్వరూ అందుకోలేకపోయారు. గత సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసి అదరగొట్టిన జోస్ బట్లర్ కూడా కోహ్లీ రికార్డును టచ్ కూడా చేయలేకపోయాడు..
 


అయితే శుబ్‌మన్ గిల్‌కి ఈ రికార్డును బ్రేక్ చేసే సువర్ణావకాశం, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే ఫైనల్ రూపంలో దొరికింది. ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 848 పరుగులు చేశాడు. ఈ రికార్డును ఇప్పటికే శుబ్‌మన్ గిల్ అధిగమించేశాడు...
 

Virat Kohli-Shubman Gill

2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్, 4 సెంచరీలతో 863 పరుగులు చేశాడు. ఈ రికార్డును అందుకోవాలంటే ఫైనల్ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ మరో 13 పరుగులు చేస్తే చాలు...

అయితే ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును అందుకోవాలంటే మాత్రం శుబ్‌మన్ గిల్, ఫైనల్‌ మ్యాచ్‌లో 123 పరుగులు చేయాల్సి ఉంటుంది...

ఇదే జరిగితే ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (2016 సీజన్), జోస్ బట్లర్ (2022 సీజన్) రికార్డును కూడా సమం చేస్తాడు శుబ్‌మన్ గిల్. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీలపై వరుస సెంచరీలు చేసిన గిల్, క్వాలిఫైయర్ 2, ఫైనల్‌లో సెంచరీలు చేస్తే ఈ ఫీట్ సాధించిన మొదటి బ్యాటర్‌గా నిలుస్తాడు.. 

ప్రస్తుతం 851 పరుగులతో ఉన్న శుబ్‌మన్ గిల్, మరో 49 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ తర్వాత ఒకే సీజన్‌లో 900 పరుగులు చేసిన ప్లేయర్‌గా కూడా నిలుస్తాడు...

కేకేఆర్ తరుపున 2021 సీజన్‌లో, గుజరాత్ టైటాన్స్ తరుపున 2022, 2023 సీజన్లలో కలిపి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో 9 ఇన్నింగ్స్‌లు ఆడి 435 పరుగులు చేశాడు శుబ్‌మన గిల్.  ఫైనల్‌లో మరో 65 పరుగులు చేస్తే సురేష్ రైనా (24 ఇన్నింగ్స్‌ల్లో 724 పరుగులు), ధోనీ (22 ఇన్నింగ్స్‌ల్లో 523 పరుగులు) తర్వాత ప్లేఆఫ్స్‌లో 500+ పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు.

Latest Videos

click me!