కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో బంగ్లాతో టెస్టు సిరీస్... టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరగలదా...

First Published Dec 9, 2022, 9:53 AM IST

కెఎల్ రాహుల్‌కి మాత్రమే కాదు, టీమిండియాకి కూడా ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. రోహిత్ శర్మ గాయపడడంతో ఏడాది ఆరంభంలోనే సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియాకి కెప్టెన్సీ చేసే అవకాశం దక్కించుకున్నాడు కెఎల్ రాహుల్. అయితే కెప్టెన్‌గా రాహుల్‌కి వచ్చిన మార్కులు శూన్యం... ఇప్పుడు మరోసారి రాహుల్‌పై కెప్టెన్సీ భారం మోపనుంది బీసీసీఐ..

KL Rahul

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించబడిన విరాట్ కోహ్లీ, చివరిగా సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అప్పటికే బీసీసీఐ చేసిన అవమానంతో టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ, మెడనొప్పి వంకతో జోహన్‌బర్గ్ టెస్టు నుంచి తప్పుకున్నాడు...

జోహన్‌బర్గ్‌లో టీమిండియా అప్పటిదాకా ఒక్క టెస్టు మ్యాచ్ ఓడిపోలేదు. అయితే కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన కెఎల్ రాహుల్ అనుభవలేమిని అద్భుతంగా వాడుకుంది సౌతాఫ్రికా. భారత జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది...

ఈ టెస్టుకి ముందు విరాట్ కెప్టెన్సీలో సెంచూరియన్‌లో మొట్టమొదటి విజయం అందుకున్న భారత జట్టు, రాహుల్ కెప్టెన్సీలో జోహన్‌బర్గ్‌లో తొలి పరాజయం చవిచూసింది. కెప్టెన్‌గా తొలి టెస్టులో విజయాన్ని అందుకోలేకపోయినా రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో వన్డే సిరీస్‌కి కూడా కెప్టెన్సీ చేశాడు కెఎల్ రాహుల్...

శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహార్, జస్ప్రిత్ బుమ్రా.. ఇలా సీనియర్లు అందరూ అందుబాటులో ఉన్నా భారత జట్టు వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో చిత్తుగా ఓడింది. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా వన్డే సిరీస్‌లో ఇంత ఘోరంగా వైట్ వాష్ అవ్వడం ఇదే తొలిసారి.. 

కెఎల్ రాహుల్‌లో ఏ కోశాన కూడా కెప్టెన్సీ లక్షణాలు లేవని స్వయంగా బీసీసీఐ అధికారులు కామెంట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కెప్టెన్‌గా మొదటి పరీక్షలో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్, జింబాబ్వే టూర్‌లో మొదటి విజయాన్ని రుచి చూశాడు...

తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. గాయం కారణంగా రోహిత్ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. దీంతో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో టెస్టు సిరీస్ జరగనుందని సమాచారం...

kl rahul

ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొదటి రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయింది టీమిండియా. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు అభిమానులు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న భారత జట్టు.. ఈ రెండు టెస్టుల్లో గెలవడం చాలా కీలకం...

Image credit: PTI

రెండు టెస్టుల్లో ఒక్క టెస్టు డ్రాగా ముగిసినా టీమిండియా ఫైనల్ చేరే అవకాశాలు తగ్గుతాయి. ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడబోతోంది భారత జట్టు..  దీంతో రాహుల్‌పై చాలా పెద్ద బరువు, బాధ్యతలను పెట్టబోతోంది భారత జట్టు.. 

click me!