మరీ బంగ్లాపై సిరీస్ ఓడిపోతారా... టీమిండియాపై బీసీసీఐ సీరియస్! సంచలన నిర్ణయాలకు సిద్ధం...

Published : Dec 08, 2022, 06:15 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది. అయితే ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం తిరుగులేని విజయాలు అందుకుంది భారత జట్టు. ఐపీఎల్‌ కెప్టెన్సీ రికార్డు చూసి రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన తర్వాత భారత జట్టు పరిస్థితి తారుమారు అయిపోయింది...

PREV
19
మరీ బంగ్లాపై సిరీస్ ఓడిపోతారా... టీమిండియాపై బీసీసీఐ సీరియస్! సంచలన నిర్ణయాలకు సిద్ధం...
virat kohli

టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న ఆల్‌టైం గ్రేట్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో అత్యధిక విజయాల శాతం అందుకున్న సారథిగా ఉన్నాడు. అయితే బలవంతంగా విరాట్‌ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం, భారత జట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది...

29

సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు రోహిత్ శర్మ. అయితే టూర్ ఆరంభానికి రోహిత్ గాయపడడంతో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్ ఆడింది టీమిండియా. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, బుమ్రా అండ్ కో వంటి సీనియర్లు ఉన్నా 3-0 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది భారత జట్టు...

39

ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయింది భారత జట్టు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ని 1-0 తేడాతో ఓడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ని 2-0 తేడాతో కోల్పోయింది...

49
Rohit Sharma

2015లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన టీమిండియా , 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. మళ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా రెండు వన్డేల్లో ఓడింది భారత జట్టు. గత 7 ఏళ్లలో బంగ్లాదేశ్‌లో రెండు సార్లు వన్డే సిరీస్ కోల్పోయిన నాలుగో జట్టుగా నిలిచింది టీమిండియా...

59

జింబాబ్వే, వెస్టిండీస్, ఆఫ్ఘాన్ తర్వాత బంగ్లాదేశ్‌లో రెండు సార్లు సిరీస్ కోల్పోయిన జట్టుగా చెత్త రికార్డు నెలకొల్పింది టీమిండియా. అదీకాకుండా ఒకే ఏడాదిలో మూడు వన్డే సిరీస్‌లు ఓడిపోవడం టీమిండియాకి గత 25 ఏళ్లలో ఇదే మొదటిసారి...

69
kl rahul

చివరిసారిగా 1997లో మూడు వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత జట్టు, 2022లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఈ పరాజయంపై బీసీసీఐ సీరియస్‌గా ఉందని సమాచారం...

79

భారత జట్టుకి సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాని ఓడించడం కష్టమే! న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్ ఓడిపోయిన అందులో ఎక్కువ క్రెడిట్ వరుణుడిదే. కానీ బంగ్లాదేశ్‌లో సిరీస్ ఓడిపోవడం భారత జట్టు అసమర్థతే...

89
Shreyas Iyer

బంగ్లాదేశ్ పిచ్‌, వాతావరణం, పరిస్థితులు భారత్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటప్పుడు టీమిండియా నుంచి ఇలాంటి పేలవ ప్రదర్శన ఆశించలేదు బీసీసీఐ. బంగ్లాదేశ్‌పై కూడా వన్డే సిరీస్ గెలవలేకపోవడం జట్టులో చాలా మార్పులు అవసరమని భావిస్తోందని భారత క్రికెట్ బోర్డు...

99
ind vs ban

వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీకి పెద్దగా సమయం లేకపోవడంతో మున్ముందు ఘన విజయాలు అందుకోవడానికి టీమిండియా ఏం చేస్తే మంచిది? ఎలాంటి మార్పులు చేస్తే మంచిదనే విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందని టాక్ వినబడుతోంది..  

Read more Photos on
click me!

Recommended Stories