రాహుల్, పంత్ ఎవరాడితే ఏంటి... టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై సంజూ శాంసన్ షాకింగ్ రియాక్షన్

Published : Sep 17, 2022, 03:51 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి చోటు దక్కకపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. వరుసగా విఫలమవుతున్నా రిషబ్ పంత్‌ని మళ్లీ మళ్లీ ఆడుతున్న టీమిండియా, సంజూ శాంసన్‌కి సరైన అవకాశాలు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందంటూ ఆరోపిస్తున్నారు అతని అభిమానులు...

PREV
16
రాహుల్, పంత్ ఎవరాడితే ఏంటి... టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై సంజూ శాంసన్ షాకింగ్ రియాక్షన్
Sanju Samson-Rishabh Pant

టీ20ల్లో రిషబ్ పంత్ కంటే సంజూ శాంసన్ సగటు, స్ట్రైయిక్ రేటు మెరుగ్గా ఉన్నప్పుడు, ఏ స్థానంలో అయినా రాణించగలనని నిరూపించుకున్న తర్వాత కూడా అతనికి ఎందుకు ఎంపిక చేయడం లేదని బీసీసీఐ సెలక్టర్లను నిలదీస్తున్నారు అభిమానులు...

26

'#SanjuSamsonforT20WC'హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేసినా ఫలితం లేకపోవడంతో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తిరువనంతపురం వేదికగా జరిగే మూడో టీ20 మ్యాచ్‌లో నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు సంజూ శాంసన్ అభిమానులు...

36
sanju samson

అయితే సంజూ శాంసన్ మాత్రం ఈ చర్యలు, తనకు ఇబ్బంది కలిగిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘దాదాపు ఐదేళ్ల తర్వాత టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను మొదటి మ్యాచ్ ఆడినప్పుడు టీమిండియా వరల్డ్ బెస్ట్ క్రికెట్ టీమ్‌గా ఉంది...

46
Sanju Samson

ఇప్పుడు కూడా టీమిండియా నెం.1 టీమ్. జట్టులో క్వాలిటీ ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు. తుది జట్టులో చోటు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయితే టీమ్‌లో ఎలాగైనా ఆడాలనే కసి పెరగాలి...

56
Sanju Samson

జట్టులో చోటు కోసం ఏం చేయగలననే పాజిటివ్ ఆలోచన చాలా అవసరం. అయితే సోషల్ మీడియాలో నా గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. కెఎల్ రాహుల్ ప్లేస్‌లో సంజూ ఆడాలి, లేదు రిషబ్ పంత్ ప్లేస్‌లో సంజూ ఆడాలని అంటున్నారు...

66

అయితే నా ఆలోచన ఒక్కటే. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా నా టీమ్, టీమిండియాకి ఆడుతున్నారు. వాళ్లు నా టీమ్ మేట్స్. వాళ్లు నా వల్ల తక్కువ కాకూడదు. నా వల్ల నా దేశం తక్కువ కాకూడదు...’ అంటూ చెప్పుకొచ్చాడు సంజూ శాంసన్...

Read more Photos on
click me!

Recommended Stories