KL Rahul
ఈ ఏడాదిలో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడని కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత గాయపడ్డాడు. గాయం కారణంగా రెండు నెలల పాటు టీమిండియాకి దూరమైన కెఎల్ రాహుల్‌ని నేరుగా ఆసియా కప్ 2022 టోర్నీ ఆడించింది టీమిండియా మేనేజ్‌మెంట్...
Image credit: Getty
ఐపీఎల్ 2022 సీజన్‌లో 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, టీమిండియాకి కీలక బ్యాటర్ అవుతాడనే ఉద్దేశంతో అతనికి వైస్ కెప్టెన్సీ కూడా కట్టబెట్టింది మేనేజ్‌మెంట్. అయితే ఆసియా కప్ టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్, టీమిండియా సూపర్ 4 రౌండ్ నుంచే ఇంటిదారి పట్టడానికి కారణమయ్యాడు...
తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ కెఎల్ రాహుల్ ఫెయిల్యూర్ కొనసాగింది. పాకిస్తాన్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికాలతో జరిగిన మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై వరుసగా హాఫ్ సెంచరీలు బాదాడు...
పసికూనలపై హాఫ్ సెంచరీలు బాదగానే రాహుల్ ఫామ్‌లోకి వచ్చాడని భ్రమపడిన టీమిండియా మేనేజ్‌మెంట్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అతన్ని బరిలో దిగింది. కీలక మ్యాచ్‌లో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రాహుల్. రెండో ఓవర్‌లోనే వికెట్ పడడంతో బ్యాటింగ్ పిచ్‌లో పవర్ ప్లేలో 38 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు...
KL Rahul
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో ఫెయిల్ అయిన కెఎల్ రాహుల్... ఆఫ్ఘాన్, నమీబియా, స్కాట్లాండ్ వంటి పసి కూనలతో జరిగిన మ్యాచుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు... ఈసారి కూడా బంగ్లా, జింబాబ్వేలపై హాఫ్ సెంచరీలు చేశాడు...
Image credit: PTI
ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌లు ఇస్తూ, వరుసగా మూడు సీజన్లలో 600+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్. 2020 సీజన్‌లో 672 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన రాహుల్, 2021, 2022 సీజన్‌లోనూ క్యాప్ రేసులో నిలిచాడు...
Image credit: PTI
కెఎల్ రాహుల్, ఆరెంజ్ క్యాప్ మీద పెట్టిన శ్రద్థ, అంకితభావం... టీమిండియాకి ఐసీసీ టైటిల్ అందించడంలో చూపించి ఉంటే... బాగుండేదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.17 కోట్లు తీసుకున్న కెఎల్ రాహుల్, టీమిండియా తరుపున ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌తో ఏడాదికి రూ.5 కోట్లు తీసుకుంటున్నాడు. త్వరలో A+ కాంట్రాక్ట్ దక్కే అవకాశం కూడా పుష్కలంగా ఉంది.
KL Rahul
మ్యాచ్ ఫీజు రూపంలో వచ్చే ఆదాయంతో కలిపి దాదాపు ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయంతో సమానంగా రాహుల్ జేబులోకి వెళ్తోంది. బ్రాండ్ అంబాసిడర్లు, స్పాన్సర్లు, ఫేమ్, క్రేజ్.. అదనం. అయినా ఐపీఎల్ ఆడినట్టుగా టీమిండియాకి ఎందుకు ఆడలేకపోతున్నాడనేది అభిమానుల అనుమానం...
Image credit: Getty
ఇంతకుముందు సురేష్ రైనా కూడా ఇదే విధంగా ఆడేవాడు. ఐపీఎల్‌లో అదరగొడుతూ టీమిండియా మ్యాచుల్లో ఫ్లాప్ అయ్యేవాడు. ఫలితంగా టీమ్‌లో చోటు కోల్పోయి, కొన్నాళ్ల తర్వాత ‘మిస్టర్ ఐపీఎల్’ ట్యాగ్‌తో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. కెఎల్ రాహుల్ ఈ విషయాన్ని త్వరగా గుర్తిస్తే బాగుంటుందని, తన కెరీర్ కూడా బాగుపడుతుందని హితవు చేస్తున్నారు అభిమానులు..