KKR vs SRH: కోల్‌కత్తా వర్సెస్ హైదరాబాద్... హెడ్ టు హెడ్ లెక్కలు...

First Published | Sep 26, 2020, 3:41 PM IST

IPL 2020: ఐపిఎల్ 2020లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలబడుతోంది. ఇరు జట్లు మొదటి మ్యాచ్‌లో ఘోర పరాజయం చెందాయి. కోల్‌కత్తా, ముంబై చేతిలో ఓడగా, హైదరాబాద్ జట్టుకి బెంగళూరు చేతిలో ఓటమి ఎదురైంది. తొలి విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరుకి నేటి మ్యాచ్ వేదిక కానుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఇప్పటిదాకా 17 సార్లు తలబడ్డాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కత్తా 10 మ్యాచుల్లో విజయం సాధించగా, కోల్‌కత్తాపై హైదరాబాద్‌కి ఏడు మ్యాచుల్లో గెలుపు దక్కింది.

కోల్‌కత్తాపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు 209 పరుగులు.
హైదరాబాద్ జట్టుపై కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 183 పరుగులు.
గత సీజన్‌లో హైదరాబాద్ కొట్టిన 181 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి చేధించింది కోల్‌కత్తా.
కోల్‌కత్తాపై సన్‌రైజర్స్ అత్యల్పంగా 128 పరుగులు చేసింది.
హైదరాబాద్‌పై నైట్‌రైడర్స్ 101 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
గత మూడు సీజన్లలో జరిగిన 8 మ్యాచుల్లో సన్‌రైజర్స్, నైట్‌రైడర్స్ జట్లకు చెరో నాలుగు మ్యాచుల్లో విజయం దక్కింది.

Latest Videos

click me!