KKR vs SRH: మొదటి విజయం దక్కెదెవరికి? నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్ల వీరే...

First Published Sep 26, 2020, 5:03 PM IST

IPL 2020: 13వ సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన ఏడు మ్యాచుల్లో ఆరు జట్లకి విజయాలు దక్కాయి. కోల్‌కత్తా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి బౌలింగ్ విభాగం బలంగా ఉండగా... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

ఆండ్రూ రస్సెల్: గత సీజన్‌లో రెండో మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌తో తలబడింది కోల్‌కత్తా. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 181 పరుగులు చేయగా... లక్ష్యసాధనలో రస్సెల్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయ హాఫ్ సెంచరీ చేసి కోల్‌కత్తాకి విజయం అందించాడు. నేటి మ్యాచ్‌లోనూ రస్సెల్ అలాంటి ఇన్నింగ్స్ ఆడితే హైదరాబాద్‌కి కష్టాలు తప్పవు.
undefined
డేవిడ్ వార్నర్: ఐపీఎల్‌లో వార్నర్ అత్యధిక స్కోరు చేసింది కోల్‌కత్తా పైనే. 59 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 126 పరుగులు చేశాడు వార్నర్. నేటి మ్యాచ్‌లో అలాంటి ఇన్నింగ్స్ ఆడితే కోల్‌కత్తా బౌలర్లకు చుక్కలు కనబడడం ఖాయం.
undefined
ఇయార్ మోర్గాన్: ఈ ఇంగ్లాండ్ కెప్టెన్‌కి రషీద్ ఖాన్‌పై మంచి రికార్డు ఉంది. గత వన్డే వరల్డ్‌కప్‌లో రషీద్ వేసిన 20 బంతుల్లో 58 పరుగులు చేశాడు మోర్గాన్. అయితే ఐపీఎల్‌లో మాత్రం రషీద్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు మోర్గాన్. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
undefined
బెయిర్‌స్టో: బెంగళూరుతో 61 పరుగులతో అద్భుతంగా రాణించాడు బెయిర్‌స్టో. బెయిర్ స్టో ఇంకొంతసేపు క్రీజులో ఉండే హైదరాబాద్‌కి విజయం దక్కేది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న బెయిర్‌స్టో, స్పెషల్ ఇన్నింగ్స్‌తో జట్టుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు.
undefined
దినేశ్ కార్తీక్: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చాడు దినేశ్ కార్తీక్. 30 పరుగులతో రాణించినా కోల్‌కత్తా విజయం సాధించలేకపోయింది. నేటి మ్యాచ్‌లో కార్తీక్ చేసే పరుగులపైనే అతని కెప్టెన్సీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
undefined
మనీశ్ పాండే: చాలా నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ పడేసుకుంటాడనేది పాండేపై ఉన్న విమర్శ. అయితే మొదట మ్యాచ్‌లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు మనీశ్. కీలకమైన నేటి మ్యాచ్‌లో పాండే మరోసారి తన టాలెంట్‌ను చూపించాల్సిన అవసరం ఉంది.
undefined
ప్యాట్ కమ్మిన్స్: అత్యంత ఖరీదైన ఈ ఆటగాడు, బౌలింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది తన సత్తా చాటినా... బౌలింగ్‌లో మూడు ఓవర్లకే 49 పరుగులు ఇచ్చాడు. నేటి మ్యాచ్‌లో ప్యాట్ కమ్మిన్స్‌కి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది.
undefined
విజయ్ శంకర్: ఈ ఆల్‌రౌండర్ గత మ్యాచులో బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. బౌలింగ్‌లో ఒక్క బంతి వేయడానికి రెండు నో బాల్స్, ఓ వైడ్‌తో 10 పరుగులు ఇవ్వగా, బ్యాటింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. నేటి మ్యాచ్‌లో రాణించడం విజయ్ శంకర్‌కి అత్యంత కీలకం.
undefined
నితీశ్ రాణా: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఓపెనర్ నితీశ్ రాణా, భారీ షాట్లను తేలిగ్గా కొట్టగలడు. రాణా 30 పరుగులకు పైగా చేసిన మ్యాచుల్లో 75 శాతం కోల్‌కత్తాకి విజయం దక్కింది.
undefined
రషీద్ ఖాన్: సన్‌రౌజర్స్ హైదరాబాద్ జట్టులో అత్యంత కీలక బౌలర్ రషీద్. రషీద్ మూడు వికెట్లు తీసిన మ్యాచుల్లో 83 శాతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే విజయం దక్కింది.
undefined
భువనేశ్వర్ కుమార్: భారత క్రికెట్‌లో స్టార్ బౌలర్‌గా ఉన్న భువనేశ్వర్ కుమార్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భువీతో పాటు సందీప్ శర్మ కూడా విఫలమయ్యాడు. ఈ ఇద్దరూ రాణించడం హైదరాబాద్‌కి అత్యంత ఆవశ్యకం.
undefined
click me!