ప్రస్తుతం న్యూజిలాండ్ లోనే ఉన్న ఫెర్గూసన్.. దేశవాళీలో భాగంగా ఆక్లాండ్ తరఫున ఆడుతూ గాయపడ్డాడు. దీంతో అతడు మార్చి 25న శ్రీలంకతో జరుగబోయే తొలి వన్డే నుంచి తప్పుకున్నాడు. 50 ఓవర్లు ఆడే ఫిట్నెస్ అతడు సాధించలేదని, అందుకే ఫెర్గూసన్ ను పక్కనబెట్టామని కివీస్ బౌలింగ్ కోచ్ షేన్ జుర్గున్సెన్ తెలిపాడు.