క్రిస్ గేల్‌కి ప్రీతి జింటా స్పెషల్ గిఫ్ట్... ఏడ్చేసిన యూనివర్సల్ బాస్...

First Published Oct 22, 2020, 5:28 PM IST

IPL 2020 సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచులు ఓడిపోయిన తర్వాత కూడా ప్లేఆఫ్ రేసులో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. టాప్ 3 జట్లపై ఢిల్లీ, ముంబై, బెంగళూరును ఓడించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ సభ్యులకి ప్రత్యేకంగా బహుమతులు ఇచ్చింది పంజాబ్ యజమాని ప్రీతి జింటా.

వరుసగా మూడు మ్యాచుల్లో గెలవడమే కష్టం అనుకుంటే, టాప్ 3లో ఉన్న జట్లపై అద్భుత విజయాలు అందుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
undefined
గేల్ జట్టులోకి వచ్చిన తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ పంజాబ్‌కి విజయమే దక్కింది...
undefined
ముంబై ఇండియన్స్‌పై డబుల్ సూపర్ ఓవర్ గేమ్‌లో గెలిచిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్...
undefined
ఆ తర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో సునాయస విజయాన్ని అందుకుని పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది పంజాబ్.
undefined
దీంతో జట్టుకి హ్యాట్రిక్ విజయాలు అందించిన క్రికెటర్లకి ప్రత్యేక బహుమతులు అందించింది ప్రీతి జింటా...
undefined
కెప్టెన్ కెఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, పేసర్ షెల్డెన్ కాట్రెల్, మహ్మద్ షమీ, క్రిస్ గేల్‌ వంటి వారికి స్పెషల్ గిఫ్ట్‌లు ఇచ్చింది ప్రీతి జింటా...
undefined
షడ్డాకా షేర్ అని రాసి ఉన్న జ్ఞాపికను అందుకున్న ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్... ఏడుస్తూ ఆనందబాష్ఫాలు రాలుస్తున్నట్టుగా నటించి, హాస్యం పండించాడు.
undefined
మహ్మద్ షమీ సూపర్ ఓవర్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసి, ముంబైకి విజయం దక్కకుండా చేశాడు...
undefined
బుమ్రా వర్సెస్ షమీ ఫైట్ తర్వాత... క్రిస్ గేల్ డబుల్ సూపర్ ఓవర్‌ మొదటి బంతికే సిక్సర్ బాది, విజయాన్ని ఈజీ చేశాడు. ఆ తర్వాత రెండు బౌండరీలు బాదిన మయాంక్ అగర్వాల్ సూపర్ ఓవర్‌లో పంజాబ్‌కి మొదటి విజయాన్ని అందించాడు.
undefined
గేల్ లేకుండా ఆడిన మొదటి ఏడు మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన పంజాబ్, క్రిస్ గేల్ ఎంట్రీ తర్వాత మూడింట్లోనూ గెలిచింది.
undefined
click me!