కింగ్, ప్రిన్స్ ట్యాగ్‌లతో మాకు ఒరిగేదేమీ లేదు.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్

Published : Jun 07, 2023, 10:46 AM IST

WTC Final 2023:  రన్ మిషీన్ విరాట్ కోహ్లీ అభిమానులు తనను ‘కింగ్’ అని, యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను ‘ప్రిన్స్’ అని పిలవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

PREV
16
కింగ్, ప్రిన్స్ ట్యాగ్‌లతో మాకు ఒరిగేదేమీ లేదు.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్

టీమిండియా మాజీ  సారథి విరాట్ కోహ్లీని తన అభిమానులంతా  ‘కింగ్ కోహ్లీ’ అని పిలుస్తారు. ఫార్మాట్, టోర్నీలతో సంబంధం లేకుండా  బరిలోకి దిగితే  రికార్డులు బద్దలుకొట్టే   కోహ్లీని అభిమానులు చాలాకాలంగా ఇలాగే పిలుచుకుంటున్నారు. 

26

ఇక యువ సంచలనం శుభ్‌మన్ గిల్  ను చాలా మంది  బ్యాటింగ్ లో అతడు కోహ్లీ వారసుడని  భావిస్తున్నారు. ఇదే క్రమంలో అతడికి ‘ప్రిన్స్’అని  పిలుస్తున్నారు. ఈ ఇద్దరూ కలిస్తే ‘కింగ్ అండ్ ప్రిన్స్ ఇన్ వన్ ఫ్రేమ్’అన్న కామెంట్స్ ఇటీవల సోషల్ మీడియాలో అధికమయ్యాయి. తాజాగా  కోహ్లీ ఈ బిరుదులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

36
Image credit: PTI

కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఈ కింగ్ అండ్ ప్రిన్స్ ట్యాగులు జనాలు మమ్మల్ని పిలుచుకోవడానికి ఆనందించడానికి మాత్రమే బాగుంటాయి.  కానీ వాటివల్ల మాకు ఒరిగేదేమీ లేదు. ఒక సీనియర్ ప్లేయర్ గా నా  దృష్టి  జట్టులో ఉన్న జూనియర్ ప్లేయర్లకు సలహాలు అందిస్తూ వారి ఎదుగుదలలో పాలు పంచుకోవడమే.

46

ఒక ఆటగాడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే అతడికి ఎంతైనా చెప్పొచ్చు. గిల్ లో కూడా నేర్చుకునే తత్వం ఎక్కువగా ఉంది.   అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.  గత కొంతకాలంగా గిల్ నిలకడగా రాణిస్తున్నాడు.  డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో కూడా గిల్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తాడని భావిస్తున్నా..’ అని చెప్పాడు. 

56
Image credit: PTI

అంతేగాక గిల్ ఎప్పుడూ తనతో  ఆట గురించే ఎక్కువగా చర్చిస్తాడని, నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడని కోహ్లీ అన్నాడు.  గిల్‌కు తన తరఫున ఏం సాయం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని  రన్ మిషీన్ చెప్పుకొచ్చాడు. 

66
Image credit: PTI

కాగా.. గిల్ కూడా విరాట్ కోహ్లీతో ఆడటాన్ని తాను  పూర్తిగా ఆస్వాదిస్తానని చెప్పాడు.  డ్రెస్సింగ్ రూమ్ తో పాటు ఆన్ ది ఫీల్డ్ లో  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ,  ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి దిగ్గజాలతో గడపడం వల్ల తాను చాలా విషయాలు నేర్చుకుంటున్నానని గిల్ తెలిపాడు. 

click me!

Recommended Stories