రవిశాస్త్రికి టాలెంట్ లేదు, ఫిట్‌నెస్ కూడా లేదు, కానీ... కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్...

First Published Jul 4, 2021, 11:35 AM IST

టీమిండియా నుంచి వచ్చిన టాప్ ఆల్‌రౌండర్లలో మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్, రవిశాస్త్రిల పేర్లు తప్పక ఉంటాయి. టీమిండియా కోచ్‌గా కూడా అదరగొడుతున్న రవిశాస్త్రికి టాలెంట్ ఏ మాత్రం లేదని కామెంట్ చేశాడు 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్‌దేవ్...

ఓ స్పిన్నర్‌గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా మారాడు రవిశాస్త్రి. కపిల్‌దేవ్ కెప్టెన్సీలో జట్టులో కీలక సభ్యుడిగా కూడా వ్యవహారించాడు...
undefined
‘రవిశాస్త్రికి నిజంగా ఎలాంటి టాలెంట్ లేదు. కానీ అతను చాలా క్రికెట్ ఆడాడు. దానికి కారణం అతని కృషి. క్రికెటర్లలో రెండు రకాల మనుషులు ఉంటారు...
undefined
కొందరు తమ టాలెంట్‌ను నమ్ముకుని క్రికెట్‌లోకి వచ్చి, రాణిస్తారు. మరికొందరు ఏ టాలెంట్ లేకపోయినా క్రికెట్‌లోకి వచ్చి, ఏళ్లకు ఏళ్లు ఆడతారు. రవిశాస్త్రి రెండో రకానికి చెందినవాడు...
undefined
రవిశాస్త్రి సుదీర్ఘ కాలం క్రికెట్‌లో కొనసాగడానికి అతని అంకిత భావమే కారణం. జట్టు గెలుపు కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉండే ప్లేయర్లు, టీమ్‌కి కావాలి. అందుకే శాస్త్రిని జట్టులో ఆడించేవాళ్లం...
undefined
రవిశాస్త్రి 30 ఓవర్లు ఆడి, కేవలం 10 పరుగులు చేసినా అది పెద్ద విషయమేమీకాదు. ఎందుకంటే అతను 30 ఓవర్లు ఆడగలిగాడంటే అదే పెద్ద విషయం... 30 ఓవర్ల తర్వాత బంతి ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహకరించదు.
undefined
ఆ తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్, దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించడానికి అవకాశం దొరుకుతుంది. జట్టుకి కావాల్సింది అదే... ’ అంటూ కామెంట్ చేశాడు కపిల్‌దేవ్...
undefined
‘నేను రవిశాస్త్రి ముఖం మీదనే చెప్పాను... నువ్వంటే నాకు ఇష్టం, అది నీకు టాలెంట్ ఉందని కాదు,నువ్వు అసలు బెస్ట్ అథ్లెట్‌వి కూడా కావు... అయినా క్రికెట్ ఆడగలుగుతున్నావని...
undefined
మరొకరు అనిల్ కుంబ్లే.. అతను కూడా అథ్లెట్ కాదు. కానీ అతని పర్ఫామెన్సులు చూస్తే... మిగిలినవాళ్ల కంటే అతను ఎంతో సాధించాడు. కుంబ్లే విషయం కూడా అతని డెడికేషన్ వల్లే ఇన్నాళ్ల కెరీర్ సాధ్యమైంది’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్.
undefined
మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా రచించిన ‘నెంబర్స్ డూ లై’ (నెంబర్లు అబద్ధం చెబుతాయి) అనే పుస్తకావిష్కరణ సభలో నాలుగేళ్ల క్రితం చెప్పిన ఈ వ్యాఖ్యలు, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...
undefined
డబ్ల్యూటీసీ పైనల్, వన్డే వరల్డ్‌కప్ 2019 ఓటమి తర్వాత కూడా భారత కోచ్‌గా రవిశాస్త్రిని కొనసాగించడం ఏంటని, అతని స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ని కోచ్‌గా ఎన్నుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి...
undefined
click me!