ధోనీ రిటైర్మెంట్ పై లెజండరీ క్రికెటర్లు ఏమన్నారంటే...

First Published | Aug 26, 2020, 12:57 PM IST

ధోనీ 2004లో తన కెరీర్ ని ప్రారంభించారు. దాదాపు 16 సంవత్సరాలపాటు ఆయన టీమిండియా కోసం ఆడారు. క్రికెట్ లో ఓ లెజెండ్ గా అందరికీ ధోనీ గుర్తుండిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన రిటైర్మెంట్ వార్తను చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.
ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా.. మహీ రిటైర్మెంట్ న్యూస్ విని షాకయ్యారు. దీంతో.. వెంటనే లేఖ కూడా రాశారు. 130 కోట్ల మంది భారతీయులు ఆయన నిర్ణయం పట్ల నిరాశ చెందారని, అయినప్పటికీ ధోనీ భారత క్రికెట్‌కు అందించిన ఎనలేని సేవలు ఎప్పటికీ నిలిచి వుంటాయని మోడీ ప్రశంసించారు.

కాగా.. కేవలం మోదీ మాత్రమే కాదు.. కపిల్ దేవ్ నుంచి స్టీవ్ వా దాకా.. చాలా మంది లెజండ్స్.. మహీ రిటైర్మెంట్ గురించి స్పందించారు.
కాగా.. ధోనీ 2004లో తన కెరీర్ ని ప్రారంభించారు. దాదాపు 16 సంవత్సరాలపాటు ఆయన టీమిండియా కోసం ఆడారు. క్రికెట్ లో ఓ లెజెండ్ గా అందరికీ ధోనీ గుర్తుండిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రపంచంలోకెల్లా గొప్ప కెప్టెన్ గా ధోనీ చరిత్ర కెక్కాడు. అంతేకాదు బెస్ట్ ఫినిషర్, బెస్ట్ వికెట్ కీపర్ గా ధోనీ ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. కాగా.. మరి అలాంటి ధోనీ గురించి దిగ్గజ క్రికెటర్లు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
టీమిండియాలోనే కూల్ కెప్టెన్ ధోనీ... కోచ్ రవిశాస్త్రి
ధోనీ హీరో, మెంటర్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
ధోనీ ఓ లిటిల్ మాస్టర్.. సునీల్ గవాస్కర్
ధోనీ లెజండరీ కెప్టెన్.. స్టీవ్ వా
ధోనీ నాకు రోల్ మోడల్... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్
నా ఫావరెట్ క్రికెటర్..పాక్ క్రికెటర్ రమీజ్ రాజా
కెప్టెన్ కూల్.. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్

Latest Videos

click me!