ఇద్దరు ఓపెనర్లు ఉండగా, మూడో ఆప్షన్ అవసరమా... విరాట్, రవిశాస్త్రిలపై కపిల్‌దేవ్ ఫైర్...

First Published Jul 4, 2021, 1:35 PM IST

ఇంగ్లాండ్ టూర్‌ ఆరంభానికి ముందే ఓపెనర్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరం కావడంతో భారత జట్టు అతని స్థానంలో పృథ్వీషాని ఆడించాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే జట్టులో ఇద్దరు ఓపెనర్లు వాళ్లను పట్టించుకోకుండా మూడో ఆప్షన్ కోసం చూడడంపై సీరియస్ అయ్యాడు భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్...

సీనియర్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా, మిడిల్ ఆర్డర్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెఎల్ రాహుల్‌... ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో గాయపడినా, గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికయ్యాడు...
undefined
ఇప్పటిదాకా 36 టెస్టులు ఆడి 5 సెంచరీలతో 2 వేలకు పైగా టెస్టు పరుగులు చేసిన కెఎల్ రాహుల్, చివరిసారిగా 2019లో వెస్టిండీస్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు...
undefined
ఆ తర్వాత న్యూజిలాండ్ టూర్‌కి, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపికైనా తుదిజట్టులో అవకాశం మాత్రం రాలేదు. ఆస్ట్రేలియా టూర్‌లో కెఎల్ రాహుల్‌కి ఛాన్స్ ఇవ్వాలని జట్టు భావించినా, మూడో టెస్టు ఆరంభానికి ముందు గాయపడిన రాహుల్, స్వదేశానికి తిరిగి వచ్చేశాడు...
undefined
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ లోకేశ్ రాహుల్‌కి నిరాశే ఎదురైంది. టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తూ రెండేళ్లుగా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు కెఎల్ రాహుల్...
undefined
అలాగే 14 టెస్టుల్లో మూడు సెంచరీలతో వెయ్యికి పైగా పరుగులు చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కి కూడా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో స్థానం దక్కలేదు...
undefined
ఆస్ట్రేలియా టూర్‌లో రాణించిన శుబ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా కొనసాగించిన టీమిండియా మేనేజ్‌మెంట్, డబ్ల్యూటీసీ టోర్నీలో 800లకు పైగా పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్‌ను తీసి పక్కనబెట్టేసింది...
undefined
ఇప్పుడు ఈ ఇద్దరూ ఇంగ్లాండ్ టూర్‌లో ఉండగానే, శుబ్‌మన్ గిల్ గాయపడడంతో అతని స్థానంలో పృథ్వీషాని ఇంగ్లాండ్‌కి రప్పించాలని భావిస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్...
undefined
‘శుబ్‌మన్ గిల్ గాయపడినా ఇప్పటికే జట్టులో ఇద్దరు ఓపెనర్లు ఉన్నారు. అయినా మూడో ఆప్షన్ అవసరమా? ఇది సెలక్టర్లను అవమానించడమే అవుతుంది.
undefined
కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అడగకపోతే, ఆ ఇద్దరికీ కాదని పృథ్వీషా కోసం సెలక్టర్లు ఆశపడతారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఓపెనర్లు ఎన్నికైన కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అనుభవం లేని ప్లేయర్లు కాదు...
undefined
ఆ ఇద్దరికీ మంచి అనుభవం ఉంది, టెస్టుల్లో మంచి మెరుగైన రికార్డు కూడా ఉంది. అలాంటప్పుడు మూడో ప్లేయర్ అవసరమా? ఇది కరెక్టు కాదు... మీరెందుకు మరో ప్లేయర్ కోసం చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు...
undefined
ఆడడానికి వాళ్లు సూట్ అవ్వరని అనుకుంటే, జట్టుకి ఎందుకు సెలక్ట్ చేశారు. సెలక్ట్ చేసిన తర్వాత వారిని పక్కనబెట్టి, ఇంకో ప్లేయర్‌ కావాలని కోరుకుంటే, అది వాళ్లను అవమానించినట్టు కాదా?
undefined
శుబ్‌మన్ గిల్ గాయపడిన తర్వాత ఈ ఇద్దరూ కాకుండా మరో ప్లేయర్ కావాలని కేవలం విరాట్ లేదా రవిశాస్త్రియే సెలక్టర్లకు చెప్పి ఉండాలి.
undefined
కెప్టెన్, కోచ్ అనేవాళ్లు ప్లేయర్లను సపోర్ట్ చేయాలి. అంతేకానీ వారిని తక్కువ చేసి కించపరచకూడదు.. ఇలాంటివి టీమిండియాలో జరగకూడదని అనుకుంటున్నా. ఇప్పుడు అనవసర వివాదాలు రేపకండి’ అంటూ హెచ్చరించాడు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్...
undefined
click me!