కెఎల్ రాహుల్ కోసం రూ.20 కోట్లు, రషీద్ ఖాన్‌కి... లక్నో టీమ్‌ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా...

First Published Nov 30, 2021, 11:47 AM IST

ఐపీఎల్‌ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టు లక్నో. 2022 సీజన్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న లక్నో టీమ్, ప్లేయర్ల విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది... ‘ఫ్రీ టికెట్’ ద్వారా ప్లేయర్లను కొనడానికి కోట్లు చెల్లించడానికి రెఢీ అవుతోంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా వస్తున్న రెండు ఫ్రాంఛైజీలకు ‘ఫ్రీ టికెట్’ ద్వారా గరిష్టంగా ముగ్గురు ప్లేయర్లను మెగా వేలానికి ముందే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది...

ఐపీఎల్ రిటెన్షన్ పాలసీ రూల్స్ ప్రకారం అయితే కొత్త ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసే మొదటి ప్లేయర్‌కి రూ.15 కోట్లు, రెండో ప్లేయర్‌కి రూ.11 కోట్లు, మూడో ప్లేయర్‌కి రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది...

అయితే ఐపీఎల్ చరిత్రలోనే రూ.7090 కోట్ల భారీ మొత్తానికి లక్నో ఫ్రాంఛైజీనికి కొనుగోలు చేసిన ఆర్‌పీఎస్ గ్రూప్... ప్లేయర్ల విషయంలో కూడా భారీగా ఖర్చు పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది...

ఐపీఎల్ 2020 సీజన్‌లో 670 పరుగులు, ఐపీఎల్ 2021 సీజన్‌లో 13 మ్యాచుల్లో 626 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌కి ఏకంగా రూ.20 కోట్లు చెల్లించడానికి లక్నో టీమ్ ఆఫర్ చేసిందని సమాచారం...

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా విరాట్ కోహ్లీకి రికార్డు ఉంది. విరాట్, ఆర్‌సీబీ కెప్టెన్‌గా గత మూడేళ్లు ఏటా రూ.17 కోట్లు తీసుకున్నాడు...

వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్. ఆర్‌సీబీ విడుదల చేసిన క్రిస్ మోరిస్‌ను, ఐపీఎల్ 2021 వేలంలో రూ.16.25 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది రాయల్స్...

ఇప్పుడు కెఎల్ రాహుల్‌కి రూ.20 కోట్లు చెల్లించడానికి లక్నో జట్లు సిద్ధమైతే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడికి రికార్డు క్రియేట్ చేశాడు భారత ఓపెనర్...

అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్‌కి రూ.16 కోట్లు చెల్లించేందుకు లక్నో జట్టు సిద్ధమైందని సమాచారం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనే తనకి మొదటి రిటెన్షన్ ఇవ్వాలని సన్‌రైజర్స్ డిమాండ్ చేస్తున్నాడట రషీద్ ఖాన్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేన్ విలియంసన్, రషీద్ ఖాన్‌లను రిటైన్ చేసుకోవాలని భావించింది. కెప్టెన్‌ కేన్‌కి మొదటి రిటెన్షన్ కార్డు వాడి, రషీద్ ఖాన్‌కి రెండో రిటెన్షన్ స్లాట్ ఇవ్వాలని అనుకుంది...

అయితే తనకి మొదటి రిటెన్షన్ ఆప్షన్ ఇస్తేనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉంటానని తేల్చి చెప్పేశాడట రషీద్ ఖాన్. దీని వెనక లక్నో టీమ్ ఆఫర్ ఉందని సమాచారం...

ఐపీఎల్ వేలంలో ప్రతీ జట్టుకి పర్సులో రూ.90 కోట్లు మాత్రమే ఉంటాయి. కేవలం ఇద్దరు ప్లేయర్ల కోసం రూ.36 కోట్లు ఖర్చు చేస్తే, మిగిలిన రూ.54 కోట్లతో జట్టును నిర్మించాల్సి ఉంటుంది...

శ్రేయాస్ అయ్యర్‌తో పాటు శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ వార్నర్ వంటి స్టార్ ప్లేయర్లు వేలంలోకి రాబోతున్నారు. వీరిని కొనుగోలు చేయాలంటే పర్సులో తగినంత డబ్బు ఉండాలి...

ఇలా ఓ బ్యాట్స్‌మెన్, ఓ స్పిన్ ఆల్‌రౌండర్ కోసం దాదాపు సగం పర్సు ఖాళీ చేస్తే... మిగిలిన దాంతో బలమైన టీమ్‌ను ఎలా నిర్మిస్తారంటూ లక్నో యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

click me!