ఇది జిడ్డాట కాదు, అంతకుమించి... భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన కేన్ విలియంసన్...

First Published Jun 22, 2021, 10:53 PM IST

ప్రస్తుత తరంలో జిడ్డాట అంటే ముందుగా గుర్తుకువచ్చే పేరు ఛతేశ్వర్ పూజారా. ‘నయా వాల్’గా గుర్తింపు పొందిన పూజారా, క్రీజులో సెటిల్ అయ్యాకే, ఓటర్ల సహనం మొత్తం నశించిన తర్వాతే పరుగులు చేయడం మొదలెడతాడు. కేన్ విలియంసన్ ఈ విషయంలో పూజారానే మించిపోయాడు...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేన్ విలియంసన్... 177 బంతుల్లో 6 ఫోర్లతో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విలియంసన్ స్ట్రైయిక్ రేటు 27.8 మాత్రమే...
undefined
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 132 బంతులు ఆడి ఓకే ఒక్క ఫోర్‌తో 44 పరుగులు చేశాడు. కోహ్లీ స్ట్రైయిక్ రేటు 33.33గా ఉంటే, కేన్ విలియంసన్ అతని కంటే స్లోగా బ్యాటింగ్ చేశాడు...
undefined
తొలి 100 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన కేన్ విలియంసన్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలోనే 100 బంతులకు పైగా ఎదుర్కొని అతి తక్కువ స్ట్రైయిక్ రేటు నమోదుచేశాడు...
undefined
ఒకానొక దశలో 15 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసిన కేన్ విలియంసన్‌ జిడ్డాటను చూసి టీమిండియా ఫ్యాన్స్‌తో పాటు న్యూజిలాండ్ ఫ్యాన్స్ కూడా ఒకదశలో అసహనానికి గురయ్యారు. బౌండరీలు బాదాలంటూ కేకలు వేశారు...
undefined
గ్రాండ్‌హోమ్‌తో కలిసి 27 పరుగులు, జెమ్మీసన్‌తో కలిసి 30, సౌథీతో కలిసి 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేన్ విలియంసన్... ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు
undefined
టెయిలెండర్లు కేల్ జెమ్మీసన్, టిమ్ సౌథీ క్రీజులోకి వస్తూనే మెరుపులు మెరిపించడం మొదలెట్టిన తర్వాత కేన్ విలియంసన్ కాస్త ఫ్రీగా ఆడడంతో స్ట్రైయిక్ రేటు కాస్త మెరుగైంది...
undefined
49 పరుగుల వద్ద అవుటైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన కివీస్ కెప్టెన్‌గా నిలిచాడు.
undefined
ఇంతకుముందు 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో 30 పరుగులు చేసిన విలియంసన్, తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు.
undefined
2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ ఫ్లెమ్మింగ్ 5 పరుగులు చేయగా 2009 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ డకౌట్ అయ్యాడు...
undefined
click me!