ఆ మూడింట్లో కేన్ విలియంసన్ ఒక్కడే... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, బాబర్ ఆజమ్‌లకు...

Published : Dec 21, 2021, 11:26 AM IST

టీ20 కెప్టెన్‌గా తప్పుకోవడం, వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించడంతో కేవలం టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే భారత జట్టు సారథిగా కొనసాగనున్నాడు విరాట్ కోహ్లీ.  ఐపీఎల్‌లోనూ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకోవడంతో విరాట్, ఓ మెగా లిస్టు నుంచి వైదొలిగాడు...

PREV
111
ఆ మూడింట్లో కేన్ విలియంసన్ ఒక్కడే... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, బాబర్ ఆజమ్‌లకు...

వైట్ బాల్ కెప్టెన్సీ, టెస్టు ఫార్మాట్ కెప్టెన్సీతో పాటు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా కొనసాగే లిస్టులో విరాట్ కోహ్లీ ఒక్కడే ఉండేవాడు.. ఇప్పుడు ఆ జాబితా నుంచి విరాట్ తప్పుకున్నట్టైంది..

211

కేవలం టీమిండియాకి టెస్టు కెప్టెన్‌గా మాత్రమే ఉండబోతున్న విరాట్ కోహ్లీ, వన్డే, టీ20లతో పాటు ఐపీఎల్‌లోనూ ఆర్‌సీబీ జట్టుకి కేవలం సీనియర్ ప్లేయర్‌గా సేవలు అందించబోతున్నాడు...

311

న్యూజిలాండ్‌కి వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేన్ విలియంసన్‌ను, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంచుకోవడంతో ఐపీఎల్‌తో పాటు మూడు ఫార్మాట్లలోనూ సారథిగా ఉన్న ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు.

411

ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టుకి కెప్టెన్‌గా ఉండేవాడు. అతన్ని కోల్‌కత్తా నైట్‌రైడర్స్ రిటైన్ చేసుకోలేదు...

511

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌ని ఐపీఎల్ వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఐపీఎల్‌లోనే కాదు, ఇంగ్లాండ్ టీ20, వన్డే టీమ్‌లోనూ అతనికి చోటు దక్కడం లేదు...

611

పాకిస్తాన్‌కి మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు బాబర్ ఆజమ్. అయితే అతను పాక్ ప్లేయర్ కావడంతో ఐపీఎల్ ఆడే అవకాశం దక్కదు...

711

విరాట్ కోహ్లీ నుంచి వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి సారథిగా ఉన్నాడు. అయితే టెస్టుల్లో రోహిత్‌కి వైస్ కెప్టెన్సీ మాత్రమే దక్కింది...

811

విరాట్ కోహ్లీ, జో రూట్... కేవలం టెస్టు ఫార్మాట్ కెప్టెన్లుగా ఉంటే, ఆరోన్ ఫించ్ కేవలం ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్‌గా ఉన్నాడు. 

911

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉన్నాడు... రోహిత్ శర్మతో పాటు, ఇయాన్ మోర్గాన్ వైట్ బాల్ కెప్టెన్సీతో పాటు ఐపీఎల్‌లోనూ కెప్టెన్లుగా కొనసాగబోతున్నారు...

1011

బాబర్ ఆజమ్, కేన్ విలియంసన్ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నా, కేవలం కేన్ మామకి మాత్రమే ఐపీఎల్ కెప్టెన్‌గానూ వ్యవహరించే అవకాశం దక్కింది...

1111

రిషబ్ పంత్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లు అంతర్జాతీయ కెప్టెన్సీ అనుభవం లేకుండా ఐపీఎల్‌లో మాత్రమే కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు...

Read more Photos on
click me!

Recommended Stories